హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. శివకుమార్, రాజేశ్వరి(45) దంపతు లు. వారు యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కుమా రులు ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఆమె మద్యం సేవించింది. తనకు ఇంకా మద్యం కావాలని భర్తకు తెలిపింది. భర్త మద్యం తీసుకురానని చెప్పాడు.
దాంతో అతనితో గొడవ పెట్టుకుని ఇంటి లోపలికి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కొద్ది సేపటి తర్వాత చిన్న కుమారుడు గౌతమ్‌కుమార్ తల్లి కోసం వెదికాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా తల్లి ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు పగలకొట్టి ఆమెను కిందకు దించారు. ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు రాజేశ్వరి సోదరుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


