
ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, విడాకులు, భరణానికి సంబంధించిన వార్తలు చాలానే వింటున్నాం. సాధారణంగా భార్యకు భర్త భరణం ఇవ్వడం కామన్. కానీ ఒక కేసులో భర్తకు రూ. 37 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కోర్టు భార్య ప్రియుడిని ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
తైవాన్‌కు చెందిన వీ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి తన భార్య జీ (మారుపేరు) ప్రేమికుడి (యోంగ్)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న వైనాన్ని గుర్తించాడు. దీంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. అక్కడితో ఆగిపోకుండా, వారిపై చట్టపరమైన చర్య తీసుకున్నాడు. తాను అనుభవించిన మానసిక క్షోభ వైవాహిక హక్కుల ఉల్లంఘనకు పరిహారంగా దాదాపు కోటి రూపాయలను డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.
విచారణ సమయంలో వీ మానసిక క్షోభకు గురైనట్లు కనిపించాడని కోర్టు గుర్తించింది. అలాగే వీ కంటే ప్రియుడు యోంగ్ సంపాదన ఎక్కువ అని కూడా గమనించింది. అందుకే మోసపోయిన భర్తకు పరిహారంగా భర్తకు 300,000 యువాన్లు (సుమారు రూ. 37 లక్షలు) చెల్లించాలని తీర్పు చెప్పింది.
2000లొ వీ- జీకి పెళ్లైంది. దాదాపు 15 సంవత్సరా సంసారిక జీవితం తరువాత 2022 నుంచి జీ తన కొలిగ్ యోంగ్‌తో సంబంధం పెట్టుకుంది. జీ,యోంగ్ ఒకేచోట పనిచేస్తారు. యోంగ్ అకౌంటింగ్ డైరెక్టర్‌గా ఉండగా, జీ ఒక ఉపాధ్యాయురాలిగా ఉంది. అయితే ఏడాది తరువాత 2023 నవంబరులో తన భార్య జీ యోంగ్‌తో రిలేషన్‌లో వున్నట్టు ఫోన్ ద్వారా గుర్తించాడు. వారిద్దరి మధ్య మెసేజ్‌లు కంటపడ్డాయి. ఇద్దరూ తరచుగా హోటళ్లలో కలుసుకోవడం, అక్రమంగా శారీరక సంబంధంలో ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు "భార్యభర్త" లుగానే వ్యవహరిస్తున్నారని కూడా గమనించి షాక్ అయ్యాడు. దీనితో తన ఎమోషన్స్‌ని హర్ట్ చేశారంటూ యోంగ్ పై దావా వేశాడు. అయితే జీకి పెళ్లి అయిందన్న విషయం తనకు తెలియదంటే బుకాయించాడు యోంగ్. కానీ వీ వాదనలను విశ్వసించిన కోర్టు ప్రియుడికి భారీ షాకే ఇచ్చింది. అయితే అతను డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు కాకుండా, రూ. 37 లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పింది. మరోవైపు ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం యోంగ్‌కి ఇచ్చింది కోర్టు