
ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దంపతులు న్యూఢిల్లీలో మెట్రో రైలులో ప్రయాణించారు. వాస్తవానికి ఇవాళ సాయంత్రం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లోని తన నివాసం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంది. అయితే, భారీ వర్షాలు, ట్రాఫిక్ రద్దీవల్ల ఢిల్లీలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తన ప్రోటోకాల్ కాన్వాయ్‌ను పక్కన పెట్టి సతీమణి బండి అపర్ణతో కలిసి సమీపంలోని శివాజీ స్టేడియం వద్దనున్న మెట్రో స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ టిక్కెట్ తీసుకుని మెట్రో రైలు ఎక్కి ఢిల్లీలోని ఏరో మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా ఎయిర్ పోర్టులోకి వెళ్లి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ పయనమయ్యారు.