రూ.6 లక్షల జాబ్‌ ఔట్‌.. వెంటనే డైవోర్స్‌! | Man loses Rs 6.23 lakh salary job, wife leaves husband | Sakshi
Sakshi News home page

రూ.6 లక్షల జాబ్‌ ఔట్‌.. వెంటనే డైవోర్స్‌!

Nov 15 2025 5:35 PM | Updated on Nov 15 2025 6:11 PM

Man loses Rs 6.23 lakh salary job, wife leaves husband

బంధాలు, ప్రేమానురాగాలు అంతా ఒక బూటకం అన్నాడో సినీ కవి. కానీ చైనాకు చెందిన ఈ భార్యా బాధితుడి వేదన వింటే అది అక్షర సత్యం అనిపించక మానదు. నెలకు రూ. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగం అలా పోయిందో లేదో ఇలా తన భార్య తనకు విడాలిచ్చి వెళ్లిపోయిందని గోడు వెళ్లబోసుకోవడంతో ఇటీవల చైనా అంతటా వైరల్‌గా మారాడు.

163.కామ్‌ ప్రకారం.. కియాన్ కియాన్ అనే 43 ఏళ్ల లా గ్రాడ్యుయేట్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో పనిచేసేవాడు. నెలకు 50,000 యువాన్లు అంటే రూ.6.23 లక్షలు జీతం. కానీ వివాహం తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటున్నాడు.

ఆమె విలాసవంతమైన ఖర్చుల ​​కోసం పాపం ఉన్న ఒక్క ఫ్లాటునూ అమ్ముకోవాల్సి వచ్చింది. విడాకుల సమయానికి తనకంటూ ఎలాంటి ఆస్తి లేకుండా పోయిందని వాపోయాడు. పాపం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమ ఏడేళ్ల సహవాసంలో వాళ్లు దగ్గరైంది 7-8 సార్లు మాత్రమే అంటే ఎవరూ నమ్మరేమో..

కియాన్‌ తన సంపాదనలో ఎక్కువ భాగం తన భార్య కోసమే ఖర్చు చేశాడు. కారణాలు తెలియదు కానీ, పాపం కియాన్‌ భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్నాడు.అప్పటి నుండి డెలివరీ రైడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడతడి జీతం నెలకు 10,000 యువాన్లు అంటే రూ.1.24 లక్షలే.

తన భార్య చాలా సౌందర్యవతి అని చెప్పుకొచ్చిన కియాన్‌.. తన జీతం తగ్గిపోగానే ఆమె విడాకులు కోరిందని ఘొల్లుమన్నాడు. ‘నేను ప్రేమిస్తున్నది నీ డబ్బునే కానీ, నిన్ను కాదు’ అని ఆమె తెగేసి చెప్పిందని వాపోయాడు.

ఇంతా చేస్తున్న ఆమె ఏదైనా పనిచేస్తుందా అంటే అదీ లేదు. కియాన్ కియాన్ సంపాందించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చేది.

వామ్మో ఇవేమీ ఖర్చులు
ఆమె పెట్టే ఖర్చుల గురించి వింటే అవాక్కవాల్సిందే. ఆమె దుస్తులు కొన్నప్పుడల్లా ఒక్కోటి మూడు రంగులలో కొనేదట. ఒకసారి ఆమె ఒక్కొక్కటి 15,000 యువాన్లు (రూ.1.87 లక్షలు) పెట్టి రెండు డిజైనర్ బ్యాగులను కొనిందని వాపోయాడు కియాన్‌.

మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కియాన్‌ భార్య చేతులు, కాళ్ళకు కూడా ఖరీదైన ఫేషియల్ క్రీములను వాడేదట. ఇక సన్నగా ఉండటానికి ఖరీదైన సప్లిమెంట్లను తీసుకునే ఆమె చాలాసార్లు కాస్మొటిక్‌ చికిత్సలూ చేయించుకుందట. ఇంత చేసినా ఇప్పటికీ తన మాజీ భార్య అంటే తనకు ద్వేషం లేదంటున్నాడు అమాయక కియాన్‌కియాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement