breaking news
china Man
-
మరో ఇద్దరు మృత్యుంజయులు
కఠ్మాండు: నేపాల్‌లో మరో అద్భుతం చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో ఆకస్మిక వరదల వల్ల కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవన శిథిలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలు చండికా శ్రేష్ట 10 రోజుల తర్వాత సజీవంగా బయటపడింది. సహాయక సిబ్బంది బురద, ఒండ్రు మట్టిని తొలగించి ఆమెను శనివారం క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నేపాల్ పోలీసులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళ నెమ్మదిగా స్పృహలోకి రావడం వీడియోలో కనిపిస్తోంది. సహాయక సిబ్బంది ఆమెను దుప్పటి, జాకెట్‌తో కప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ వృద్ధురాలిని చికిత్స కోసం వెంటనే హెలికాప్టర్లో కఠ్మాండు ఆసుపత్రికి తరలించారు. సొరంగంలో చైనా జాతీయుడు రసువా జిల్లాలో భారీ వరదల ధాటికి ధ్వంసమైన అప్పర్ త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగం నుంచి ఒక చైనా జాతీయుడిని శనివారం రక్షించారు. అతడిని లూహైటతావోగా గుర్తించారు. వరదల సమయంలో ‘ఆడిట్ టన్నెల్ 4’లో చిక్కుకుపోయాడు. లూహైతావోను నేపాలీ సైన్యం, విదేశీ సహాయక సిబ్బందితో కూడిన బృందం కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. సొరంగ మార్గంలో సుమారు 225 మీటర్ల లోపల ఉన్న ఒక ప్రదేశం నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగాల సజీవంగా బయటకు తీసిన కార్మికుల సంఖ్య మొత్తం మూడుకు చేరింది. శుక్రవారం త్రిశూలి 3ఏ జలవిద్యుత్ ప్లాంట్‌లోని ఒక సొరంగం నుంచి ఇద్దరు కార్మికులు కబిర్ మహర్జన్, సంజయ్ షాను రక్షించిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో పదికిపైగా జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద కనీసం 900 మంది కార్మికులు గల్లంతయ్యారని, వీరిలో దాదాపు 500 మంది సొరంగాల లోపలే ఉండి ఉంటారని అధికారులు వెల్లడించారు. 1,344కి చేరిన మృతుల సంఖ్య నేపాల్ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం 1,344కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు 13,000 మందికి పైగా బాధితులను రక్షించామని పేర్కొన్నారు. ఎనిమిది జిల్లాల్లో ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల్లో 758 పెద్దలవి, 85 పిల్లలవి కాగా, 501 మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభించాయని తెలిపారు. డీఎన్ఏ సేకరణ సహా చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మొత్తం 1,030 మృతదేహాలను ఖననం చేశారు. కేవలం 96 మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఏడేళ్లు భర్త వేళ్లు కొరుకుతూ...చివరకు ‘ఐ లవ్యూ’ చెప్పాడు!
చైనాలో ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన భర్త పుర్రెకు తీవ్ర గాయం కావడంతో, అతని మెదడుకు కలిగిన తీవ్రమైన నష్టాన్ని తగ్గించడానికి ఒక మహిళ దాదాపు 7 సంవత్సరాలుగా ప్రతిరోజూ అతని కాలివేళ్లను కొరుకుతూనే ఉంది. అదేంటి విచిత్రంగా అనుకుంటున్నారా? అసలు ఏమైంది తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.చైనాకు చెందిన సాంగ్ మెయి (Song Mei) అనే మహిళ, తన భర్త జావో జిన్కియాన్ (Zhao Jinqian) మెదడు దెబ్బతిని ఏడేళ్లుగా కోమా (vegetative state)లో ఉండగా, వైద్యుల సలహా మేరకు ఆయన నరాలను ఉత్తేజపరిచేందుకు ప్రతిరోజూ ఆయన కాలి వేళ్లను కొరుకుతూ సపర్యలు చేసింది. ఆమె చేసిన ఈ అంకితభావం వల్ల భర్త కోలుకుని "ఐ లవ్ యూ" అని మాట్లాడటంతో ఈ వార్త వైరల్ అయింది. స్టోరీ ఏంటంటే..2019 అక్టోబర్‌లో, వాటర్ప్రూఫింగ్ కార్మికుడైన జావో జిన్కియాన్ ఒక గిడ్డంగి పైకప్పుపైకి ఎక్కి, అందులో చిక్కుకున్న ఒక పసిబిడ్డను రక్షించాడు. మూడేళ్ల చిన్నారిని సురక్షితంగా కిందకు తీసుకువస్తుండగా, సుమారు 6 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోయాడు.కానీ బిడ్డకు దెబ్బ తగలకుండా తన బాడీని అడ్డంగా పెట్టాడు. దీంతో ఆ బిడ్డకు ఎలాంటి గాయం కాలేదు కానీ జావో తలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో అంతను కోమాలోకి వెళ్లిపోయాడు. సీటీ స్కాన్ సమయంలో అతనికి కొద్దిసేపు స్పృహ తిరిగి వచ్చినప్పుడు, బిడ్డ క్షేమంగా ఉందా? అడిగి మళ్లీ స్పృహ తప్పిపోయాడు.ఆయన మళ్లీ స్పృహలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చిచెప్పారు. కానీ అతని నరాల్లో చలనం (నరాల ఉద్దీపన) కోసం అతని పాదాలను, వేళ్లను తాకుతూ ఉత్తేజపరుస్తూ ఉండాలని సూచించారు. దీంతో సాంగ్ అతని కాలివేళ్లను మెల్లగా కొరికినప్పుడు, ఒక చిన్న స్పందనను గమనించింది. అంతే ఆ రోజే తన ఉద్యోగాన్ని వదిలేసి, అతని పక్కనే ఉంటూ, అతనికి స్నానం చేయిస్తూ, మసాజ్ చేస్తూ, ప్రతిరోజూ అతనితో మాట్లాడుతూ ఉండేది. ఆమె అతని పాదాన్ని ఒక ప్లాస్టిక్ సంచితో కప్పి, ఏడేళ్ల పాటు ప్రతిరోజూ అలాగే చేసింది. వారి ఇద్దరు పిల్లల పోషణ కోసం తన సొంత చిత్రాలను ఆన్లైన్లో అమ్ముకుంటూ గడిపింది.ఇదీ చదవండి: గర్భిణీ సహా ముగ్గురిపై కత్తులతో దాడి: డ్యూటీ ఆఫీసర్‌కు హ్యాట్సాఫ్ఎట్టకేలకు ఏళ్ల తరబడి ఆమె చేసిన సేవలు ఫలించాయి! జావో నెమ్మదిగా స్పందించడం ప్రారంభించాడు. ఈ ఏడాది జూన్ 30న ఝావో "సాంగ్ మే, లవ్ యూ అని మెల్లిగా గుసగుసలాడటంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చికిత్స సమయంలో, అతను పలకగలిగే ఏకైక పదం ఆమె పేరే. దీంతో అతను తొందరలోనే సాధారణ స్థితికి వస్తాడనే ఆశలు చిగురించాయి. సోషల్ మీడియా స్పందననిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం సాంగ్ మెయ్ అంటూ నెటిజన్లు కొనియాడుతుండగా, జావో ధైర్యం , ఆయన భార్య త్యాగం మానవత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ దంపతులు చాలా సాదాసీదాగా, దయాగుణంతో ఉండేవారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పటికీ, ఒక మారుమూల కొండ ప్రాంతానికి చెందిన విద్యార్థి చదువుకు స్పాన్సర్ చేసేవారు. కిండర్‌గార్టెన్ ఆర్ట్ టీచర్‌గా పనిచేసే సాంగ్ పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా పెయింటింగ్ పాఠాలు చెప్పేదట.ఇదీ చదవండి: రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ! -
రూ.6 లక్షల జాబ్ ఔట్.. వెంటనే డైవోర్స్!
బంధాలు, ప్రేమానురాగాలు అంతా ఒక బూటకం అన్నాడో సినీ కవి. కానీ చైనాకు చెందిన ఈ భార్యా బాధితుడి వేదన వింటే అది అక్షర సత్యం అనిపించక మానదు. నెలకు రూ. లక్షల్లో జీతమొచ్చే ఉద్యోగం అలా పోయిందో లేదో ఇలా తన భార్య తనకు విడాలిచ్చి వెళ్లిపోయిందని గోడు వెళ్లబోసుకోవడంతో ఇటీవల చైనా అంతటా వైరల్‌గా మారాడు.163.కామ్ ప్రకారం.. కియాన్ కియాన్ అనే 43 ఏళ్ల లా గ్రాడ్యుయేట్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో పనిచేసేవాడు. నెలకు 50,000 యువాన్లు అంటే రూ.6.23 లక్షలు జీతం. కానీ వివాహం తన జీవితాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందంటున్నాడు.ఆమె విలాసవంతమైన ఖర్చుల కోసం పాపం ఉన్న ఒక్క ఫ్లాటునూ అమ్ముకోవాల్సి వచ్చింది. విడాకుల సమయానికి తనకంటూ ఎలాంటి ఆస్తి లేకుండా పోయిందని వాపోయాడు. పాపం మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తమ ఏడేళ్ల సహవాసంలో వాళ్లు దగ్గరైంది 7-8 సార్లు మాత్రమే అంటే ఎవరూ నమ్మరేమో..కియాన్ తన సంపాదనలో ఎక్కువ భాగం తన భార్య కోసమే ఖర్చు చేశాడు. కారణాలు తెలియదు కానీ, పాపం కియాన్ భారీ జీతమొచ్చే ఉద్యోగాన్ని ఐదేళ్ల క్రితం పోగొట్టుకున్నాడు.అప్పటి నుండి డెలివరీ రైడర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడతడి జీతం నెలకు 10,000 యువాన్లు అంటే రూ.1.24 లక్షలే.తన భార్య చాలా సౌందర్యవతి అని చెప్పుకొచ్చిన కియాన్.. తన జీతం తగ్గిపోగానే ఆమె విడాకులు కోరిందని ఘొల్లుమన్నాడు. ‘నేను ప్రేమిస్తున్నది నీ డబ్బునే కానీ, నిన్ను కాదు’ అని ఆమె తెగేసి చెప్పిందని వాపోయాడు.ఇంతా చేస్తున్న ఆమె ఏదైనా పనిచేస్తుందా అంటే అదీ లేదు. కియాన్ కియాన్ సంపాందించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ వచ్చేది.వామ్మో ఇవేమీ ఖర్చులుఆమె పెట్టే ఖర్చుల గురించి వింటే అవాక్కవాల్సిందే. ఆమె దుస్తులు కొన్నప్పుడల్లా ఒక్కోటి మూడు రంగులలో కొనేదట. ఒకసారి ఆమె ఒక్కొక్కటి 15,000 యువాన్లు (రూ.1.87 లక్షలు) పెట్టి రెండు డిజైనర్ బ్యాగులను కొనిందని వాపోయాడు కియాన్.మరో విస్తుపోయే విషయం ఏమిటంటే.. కియాన్ భార్య చేతులు, కాళ్ళకు కూడా ఖరీదైన ఫేషియల్ క్రీములను వాడేదట. ఇక సన్నగా ఉండటానికి ఖరీదైన సప్లిమెంట్లను తీసుకునే ఆమె చాలాసార్లు కాస్మొటిక్ చికిత్సలూ చేయించుకుందట. ఇంత చేసినా ఇప్పటికీ తన మాజీ భార్య అంటే తనకు ద్వేషం లేదంటున్నాడు అమాయక కియాన్కియాన్. -
లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!
చైనాలో 28 ఏళ్ల వ్యక్తి 680 మిలియన్ యువాన్స్ (రూ. 795 కోట్ల కంటే ఎక్కువ) లాటరీ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చైనా దేశంలో ఇదే అతి పెద్ద లాటరీ కావడం గమనార్హం. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించిందని చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ వెల్లడించింది. చైనాకు చెందిన ఓ చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్‌పై బెట్టింగ్ చేశాడు, దీంతో అతని ప్రతి టిక్కెట్‌కు 5.16 మిలియన్ యువాన్స్ బహుమతి లభించిందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే విజేత వివరాలను సంస్థ బయటపెట్టలేదు. లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఈ నెల 7న బహుమతి స్వీకరించారని, ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. ఇంత డబ్బు లాటరీ గెలిచాననే ఆనందంలో అతనికి నిద్ర పట్టలేదని, ఉద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. మొదట్లో తనని తానె నమ్మలేదని, ఇది నిజమా.. కాదా అని నమ్మడానికి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నట్లు తెలిపారు. చైనా నిబంధనల ప్రకారం గెలుచుకున్న బహుమతిలో ఐదోవంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: రెస్టారెంట్‌గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్ చైనాలో ఇప్పటి వరకు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ ఇదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2012లో బీజింగ్‌కు చెందిన ఒక వ్యక్తి 570 మిలియన్ యువాన్లు, గత ఏడాది తూర్పు జియాంగ్జి ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి 200 మిలియన్ యువాన్లను లాటరీలో గెలుచుకున్నారు. -
గూఢచర్యానికి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ‘స్పై రింగ్’కు (గూఢచార్యనికి సంబంధించిన కార్యక్రమాలు) పాల్పడుతున్న ఓ చైనా దేశీయున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి ఆధార్ కార్డ్‌తో పాటు పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. చైనా దేశీయుడైన చార్లీ పెంగ్(39) 5 సంవత్సరాల క్రితం ఇండియాకు వచ్చాడు. గుర్గావ్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఫారిన్ కరెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చార్లీ పెంగ్ ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు అతని మీద నిఘా పెట్టారు. చార్లీ గూఢచార్యానికి పాలపడుతున్నట్లు తెలియడంతో పోలీసులు అతని నివాసం మీద దాడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అతని ఆధార్ కార్డ్, పాస్‌పోర్టు, 3. 5 లక్షల రూపాయల దేశీయ కరెన్సీ, 2000 అమెరికన్ డాలర్లు, 2 వేల థాయ్ కరెన్సీతో పాటు ఓ ఎస్‌యూవీని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక అతను మణిపూర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకుని పాస్‌పోర్ట్ పొందినట్లుగా పోలీసులు తెలిపారు. -
ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు!
బీజింగ్: అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. ఈ ఘటన చైనాలో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జౌలో ఓ చిన్నారి తన ఇంట్లో మూడో అంతస్తులో ఆడుకుంటోంది. అప్పటివరకూ బాగానే ఉంది. అలా అడుకుంటున్న బాలిక కొంత సమయంలోనే ఇంటి బాల్కనీ వైపు వెళ్లింది. ఏదో వస్తువు అందుకునే క్రమంలో పట్టుతప్పి మూడో అంతస్తు నుంచి పడిపోయింది. బాల్కనీ పక్కన ఉన్న కొద్దిపాటి భాగంపై పడ్డ చిన్నారి ప్రాణభయంతో ఏడుస్తుంటే ఓ షాపు ఓనర్ లాంగ్ చంక్వెన్ వెంటనే స్పందించారు. వెంటనే నాలుగో అంతస్తుకు వెళ్లి బాల్కనీ కిటికీ నుంచి తలకిందులుగా వేలాడుతూ చిన్నారికి సాయం చేసే యత్నం చేశారు. దీంతో మరో వ్యక్తి అక్కడికి వచ్చి చంక్వెన్ కాళ్లు పట్టుకుని కిటికీలోంచి లోపలికి లాగుతుండగా, బాలిక చేతిని పట్టుకుని అతికష్టమ్మీద పైకి లాగి ప్రాణాలు రక్షించారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చిన్నారిని కాపాడిన షాపు ఓనర్ స్థానికంగా హీరో అయ్యారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు ఆయన చూపిన ధైర్య సాహసాలను స్థానికులు మెచ్చుకుంటున్నారు. చిన్నారిని కాపాడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు తమ సెల్ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. -
ఒంటిపై 11 లక్షల తేనెటీగలతో సాహసం
బీజింగ్: చైనాలో టాయ్యన్ నగరానికి చెందిన 55 ఏళ్ల గావో బింగ్గువో సరికొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. తేనె అమ్ముకునే గావో తేనె టీగలతో సాహస కార్యక్రమం చేశాడు. గావో తన ఒంటిపైకి దాదాపు 11 లక్షల తేనెటీగలను ఆకర్షించాడు. వీటి బరువు 109 కిలోలు. దీంతో గతంలో ఉన్న రికార్డు (85 కిలోలు బరువు)ను గావో బద్దలుకొట్టాడు. ఈ సాహసం చేసే సమయంలో గావో లోదుస్తులు మాత్రమే ధరించాడు. మొదట కొన్ని వందల తేనెటీగలు మాత్రమై ఆయన శరీరంపై వాలాయి. ఆ తర్వాత లక్షలాది తేనెటీగలు వచ్చి ఆయన ఒంటిపై చేరాయి. గావో తన పెదవులపైకి తేనెటీగలు రాకుండా ఉండేందుకు సిగరెట్ వెలిగించుకున్నాడు. ఈ సాహసం చేసే క్రమంలో ఆయన శరరీ ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగింది. అయినా పట్టుదలతో రికార్డు సృష్టించాడు. అన్నట్టు గావోకు తేనెటీగలతో దశాబ్దాల అనుబంధముంది. 35 ఏళ్లుగా తేనెటీగలను సంరక్షిస్తున్నాడు.


