ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు! | China man risk to save life of child video viral | Sakshi
Sakshi News home page

ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు!

Jan 23 2018 4:49 PM | Updated on Jan 23 2018 7:22 PM

China man risk to save life of child video viral - Sakshi

బీజింగ్‌: అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. ఈ ఘటన చైనాలో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జౌలో ఓ చిన్నారి తన ఇంట్లో మూడో అంతస్తులో ఆడుకుంటోంది. అప్పటివరకూ బాగానే ఉంది. అలా అడుకుంటున్న బాలిక కొంత సమయంలోనే ఇంటి బాల్కనీ వైపు వెళ్లింది. ఏదో వస్తువు అందుకునే క్రమంలో పట్టుతప్పి మూడో అంతస్తు నుంచి  పడిపోయింది. బాల్కనీ పక్కన ఉన్న కొద్దిపాటి భాగంపై పడ్డ చిన్నారి ప్రాణభయంతో ఏడుస్తుంటే ఓ షాపు ఓనర్ లాంగ్ చంక్వెన్ వెంటనే స్పందించారు. వెంటనే నాలుగో అంతస్తుకు వెళ్లి బాల్కనీ కిటికీ నుంచి తలకిందులుగా వేలాడుతూ చిన్నారికి సాయం చేసే యత్నం చేశారు. దీంతో మరో వ్యక్తి అక్కడికి వచ్చి చంక్వెన్‌ కాళ్లు పట్టుకుని కిటికీలోంచి లోపలికి లాగుతుండగా, బాలిక చేతిని పట్టుకుని అతికష్టమ్మీద పైకి లాగి ప్రాణాలు రక్షించారు.

ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చిన్నారిని కాపాడిన షాపు ఓనర్‌ స్థానికంగా హీరో అయ్యారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు ఆయన చూపిన ధైర్య సాహసాలను స్థానికులు మెచ్చుకుంటున్నారు. చిన్నారిని కాపాడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు తమ సెల్‌ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement