girl rescued
-
ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు!
బీజింగ్: అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. ఈ ఘటన చైనాలో ఇటీవల చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ హాంగ్జౌలో ఓ చిన్నారి తన ఇంట్లో మూడో అంతస్తులో ఆడుకుంటోంది. అప్పటివరకూ బాగానే ఉంది. అలా అడుకుంటున్న బాలిక కొంత సమయంలోనే ఇంటి బాల్కనీ వైపు వెళ్లింది. ఏదో వస్తువు అందుకునే క్రమంలో పట్టుతప్పి మూడో అంతస్తు నుంచి పడిపోయింది. బాల్కనీ పక్కన ఉన్న కొద్దిపాటి భాగంపై పడ్డ చిన్నారి ప్రాణభయంతో ఏడుస్తుంటే ఓ షాపు ఓనర్ లాంగ్ చంక్వెన్ వెంటనే స్పందించారు. వెంటనే నాలుగో అంతస్తుకు వెళ్లి బాల్కనీ కిటికీ నుంచి తలకిందులుగా వేలాడుతూ చిన్నారికి సాయం చేసే యత్నం చేశారు. దీంతో మరో వ్యక్తి అక్కడికి వచ్చి చంక్వెన్ కాళ్లు పట్టుకుని కిటికీలోంచి లోపలికి లాగుతుండగా, బాలిక చేతిని పట్టుకుని అతికష్టమ్మీద పైకి లాగి ప్రాణాలు రక్షించారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా చిన్నారిని కాపాడిన షాపు ఓనర్ స్థానికంగా హీరో అయ్యారు. బాలిక ప్రాణాలు కాపాడేందుకు ఆయన చూపిన ధైర్య సాహసాలను స్థానికులు మెచ్చుకుంటున్నారు. చిన్నారిని కాపాడుతున్న సమయంలో కొందరు వ్యక్తులు తమ సెల్ఫోన్లలో ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. -
పెళ్లి పేరుతో దుర్మార్గం
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేదరికంతో ఇద్దరు కూతుర్ల పెళ్లిళ్లు ఎలా చేయాలనుకుంటున్న ఆ దంపతుల బలహీనతను ఆసరా చేసుకుని 16 ఏళ్ల బాలికను చెరబట్టిన దుర్మార్గుడి ఉదంతమిది. పెళ్లి పేరుతో 16 ఏళ్ల బాలికను గృహనిర్బంధానికి గురిచేసి నెలరోజులకుపైగా అత్యాచారానికి పాల్పడిన మృగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ కురుసాడి ప్రాంతానికి చెందిన రాబర్ట్ బెల్లార్మిన్ (42) పరోటా మాస్టర్. నాగర్‌కోవిల్ సమీపం పల్లందురై ప్రాంతానికి చెందిన రాబర్ట్‌కు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మనస్పర్థల కారణంగా రాబర్ట్ భార్యతో విడిపోయాడు. రెండోపెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రాబర్ట్ తంజావూరు నాంజికోట్టై రోడ్డుకు చెందిన పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. వీరిలో 16 ఏళ్ల పెద్ద కుమార్తె పదో తరగతి చదువుపూర్తి చేయగా పెళ్లి చేసేందుకు వరుడు కోసం వెతుకుతున్నారు. తనకిచ్చి పెళ్లి చేస్తే అప్పులు తీర్చడంతోపాటు రూ.లక్ష నగదు ఇస్తానని బాలిక తల్లిదండ్రులను ప్రలోభపెట్టాడు. డబ్బుకు ఆశపడి గత నెల 10వ తేదీన కులశేఖరలోని ఒక ఆలయం బయట ఇరువురి చేత మాలలు మాత్రమే మార్పించి పెళ్లి అయిందనిపించారు. అదే ప్రాంతంలో ఇల్లు తీసుకున్న రాబర్ట్ కాపురం చేయాల్సిందిగా సదరు బాలికను వేధించడం ప్రారంభించాడు. తనతో సన్నిహితంగా ఉంటేనే తల్లితండ్రులకు డబ్బు ఇస్తానంటూ బాలికను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడేవాడు. రాబర్ట్ తీరును అనుమానించిన స్థానికులు చైల్డ్‌లైన్ సంస్థకు సమాచారం ఇచ్చారు. చైల్డ్‌లైన్ సిబ్బంది స్థానిక పోలీసులను వెంటపెట్టుకుని గురువారం సదరు ఇంటికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే బాలిక కన్నీళ్లపర్యంతమైంది. మహిళా పోలీసుస్టేషన్‌కు ఆ బాలికను తరలించి విచారించగా తన దీనగాథను చెప్పుకుని బావురుమంది. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాబర్ట్ కోసం గాలిస్తున్నారు. -
ఈ పాప..భలే అదృష్టవంతురాలు