లాట‌రీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు! | Chinese Man Wins Rs 795 Crore Lottery | Sakshi
Sakshi News home page

లాట‌రీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!

Feb 22 2024 12:53 PM | Updated on Feb 22 2024 1:30 PM

Chinese Man Wins Rs 795 Crore Lottery - Sakshi

చైనాలో 28 ఏళ్ల వ్యక్తి 680 మిలియన్ యువాన్స్ (రూ. 795 కోట్ల కంటే ఎక్కువ) లాటరీ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చైనా దేశంలో ఇదే అతి పెద్ద లాటరీ కావడం గమనార్హం. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించిందని చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్‌సైట్ వెల్లడించింది.

చైనాకు చెందిన ఓ చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతిసారీ ఏడు నంబర్‌లతో కూడిన ఒకే గ్రూప్‌పై బెట్టింగ్ చేశాడు, దీంతో అతని ప్రతి టిక్కెట్‌కు 5.16 మిలియన్ యువాన్స్ బహుమతి లభించిందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే విజేత వివరాలను సంస్థ బయటపెట్టలేదు.

లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఈ నెల 7న బహుమతి స్వీకరించారని, ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. ఇంత డబ్బు లాటరీ గెలిచాననే ఆనందంలో అతనికి నిద్ర పట్టలేదని, ఉద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. మొదట్లో తనని తానె నమ్మలేదని, ఇది నిజమా.. కాదా అని నమ్మడానికి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నట్లు తెలిపారు. చైనా నిబంధనల ప్రకారం గెలుచుకున్న బహుమతిలో ఐదోవంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: రెస్టారెంట్‌గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్

చైనాలో ఇప్పటి వరకు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ ఇదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2012లో బీజింగ్‌కు చెందిన ఒక వ్యక్తి 570 మిలియన్ యువాన్లు, గత ఏడాది తూర్పు జియాంగ్జి ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి 200 మిలియన్ యువాన్లను లాటరీలో గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement