
హైదరాబాద్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిన వివరాల ప్రకారం జనగాం జిల్లా మొండ్రాయి గ్రామానికి చెందిన ధరావత్ రాజేష్, శిరీష దంపతులు బోడుప్పల్ శ్రీలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లయి మూడేళ్లయినా సంతానం కలగలేదు.
ఈ విషయంలో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో మనస్తాపం చెందిన రాజేష్ ఈ నెల 20న ఉదయం భార్య బయటకు వెళ్లగానే..ఇంట్లోనుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో, తెలిసిన వారివద్ద వెతికినా ఫలితం కన్పించలేదు. ఈ మేరకు మంగళవారం భార్య శిరీష తన భర్త కన్పించడం లేదని ఫిర్యాదు చేరని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ గోవింద రెడ్డి తెలిపారు.