
కొల్లం: కేరళలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను ఆమె భర్తే హత్య చేసి, అనంతరం ఫేస్‌బుక్ లైవ్‌లో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటన పునలూర్ సమీపంలోని కూతనాడిలో చోటుచేసుకుంది. పోలీసులు మృతురాలిని కొల్లం నివాసి షాలినిగా గుర్తించారు.
భార్య షాలినిని హత్యచేసిన అనంతరం భర్త ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం షాలిని, ఐజాక్ దంపతుల మధ్య గత కొన్నేళ్లుగా వివాదాలున్నాయి. సోమవారం షాలిని స్నానం చేసేందుకు వెళుతున్నప్పుడు ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేసి, ఆమె మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలు చేశాడు. ఘటన జరిగిన వెంటనే నిందితుడు ఐజాక్ ఫేస్‌బుక్ లైవ్‌లో తన నేరాన్ని అంగీకరించాడు. షాలినిపై అపనమ్మకం ఏర్పడిందని ఆరోపించాడు.
తరువాత ఐజాక్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తన భార్యను తానే హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వెంటనే నిందితుని ఇంటికి చేరుకుని, షాలిని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. షాలిని, ఐజాక్‌ల 19 ఏళ్ల కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుని, దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ఇంటిని ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోందని, మృతురాలు, నిందితుని మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.