దూకమన్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే.. | Woman Jumps Off Roof After Husband’s Assault, Video Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: దూకమన్న భర్త! ఆ భార్య ఏం చేసిందంటే..

Sep 4 2025 11:35 AM | Updated on Sep 4 2025 11:42 AM

UP husband Challange Wife to Jumps Off Roof Video Viral

ఆ భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో.. ఆమెను అతగాడు చితకబాదేశాడు. దీంతో ఏడుస్తూ ఆ భార్య ఇంటి మేడ మీదకు చేరింది. అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరించింది. దమ్ముంటే దూకమంటూ ఆ భర్త ఆమెకు చాలెంజ్‌ చేస్తూ పదే పదే చెప్పసాగాడు. కట్‌ చేస్తే.. ఆమె అన్నంత పని చేసింది. 

ఉత్తర ప్రదేశ్‌ అలీబాగ్‌లో దారుణం జరిగింది. గోండా ఏరియా దాకౌలి గ్రామంలో రెండతస్తుల మేడ మీద నుంచి దూకిన ఓ మహిళ.. ఆస్పత్రి పాలైంది. భార్యభర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. 

భర్త కొట్టడంతో ఆమె ఏడుస్తూ మిద్దెపైకి చేరిందని, అక్కడి నుంచి దూకుతానని బెదిరించిందని, దూకి చావమని భర్త అనడంతో ఆమె అన్నంత పని చేసిందని, భూమిని బలంగా తాకడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే కిందపడిన తర్వాత కూడా ఆమెపై భర్త దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఓ చిన్నారి మమ్మీ.. మమ్మీ.. అంటూ ఏడుస్తూ కనిపించాడు. మహిళ తరఫు బంధువుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement