ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్‌ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.
మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్‌లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్‌తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?
అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.
A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.
JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳
MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025


