breaking news
gold chian
-
భార్యపై ప్రేమ: నాణేలు కూడబెట్టి..
ఇటీవల కాలంలో భార్య, భర్తకు.. భర్త, భార్యకు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం, సర్ప్రైజ్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే కొంతమంది భిన్నంగా ఆలోచిస్తారు. దీనికి కారణం వారి ఆర్ధిక స్తోమత కావచ్చు.. లేదా ఇంకేదైనా కారణం కూడా కావొచ్చు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని అహిర్వాన్ ప్రాంతానికి చెందిన 22ఏళ్ల అభిషేక్ యాదవ్.. పాన్ షాప్ నడుపుకుంటూ ఉండేవాడు. ఇతడు ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తన భార్యకు బంగారు గొలుసు ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి కారణంగా ఒకేసారి గొలుసు కొనలేడు. కాబట్టి డబ్బు కూడబెట్టాలనుకున్నాడు. అప్పటి నుంచి నాణేలను పోగు చేయడం ప్రారంభించాడు. ఏడాది పొడువునా రూ.10, రూ. 20నాణేలను కూడబెట్టాడు.మొత్తం కూడబెట్టిన నాణేల బస్తాలను.. బంగారు ఆభరణాల దుకాణానికి తీసుకెళ్లాడు. బస్తాలను కౌంటర్లో దగ్గర పెట్టాడు. ఇది చూసిన షాప్ యజమాని మహేష్ వర్మ మొదట ఆశ్చర్యపోయాడు. ఇన్ని నాణేలను బ్యాంకు కూడా తీసుకోదని వర్మ.. అభిషేక్‌తో చెప్పాడు. కానీ కొంతసేపటి తరువాత అంగీకరించాడు. మొత్తం నాణేలను లెక్కపెడితే.. రూ. 1.05 లక్షలు ఉన్నాయి. దీనిని లెక్కపెట్టడానికి రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: షఫాలీ వర్మ కొత్త స్పోర్ట్స్ కారు: ధర ఎంతో తెలుసా?అభిషేక్ యాదవ్ తన భార్య కోసం కొన్న గొలుసు రూ. 1.25 లక్షలు. కానీ అతడు తెచ్చిన డబ్బును మహేష్ వర్మ తీసుకుని, మిగిలిన డబ్బును వాయిదాల పద్దతిలో కట్టించుకోవడానికి అంగీకరించాడు. మొత్తానికి యాదవ్ తన భార్య కోసం.. బంగారు గొలుసు కొనేసాడు.A Kanpur Paan sellar saves ₹20 Coins daily to buy ₹1 Lakh Gold Chain as a surprise Gift for his Wife.JEWELLER : I was SHOCKED. It took more than two hours to count all the coins 😳MAN : I’ll present it to her when she returns from her Maayka ♥️ pic.twitter.com/Dr0nMX6htj— News Algebra (@NewsAlgebraIND) November 23, 2025 -
Gold hair: అతని జుట్టు పీకితేచాలు లైఫ్ సెట్!!
పడమటి దేశాల్లో కొందరు బంగారంలాంటి జుట్టు అంటే మోజుపడతారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం బంగారంతోనే జుట్టు ఉండాలని అనుకున్నాడు. అనుకోవడమే కాదు. దానిని నిజం కూడా చేసుకున్నాడు కూడా. సుమారు రెండు మిలియన్ డాలర్స్ అంటే మన కరెన్సీలో రూ.14 కోట్లు ఖర్చు చేసి తన తలపైభాగం మొత్తం వివిధ బంగారు గొలుసులతో అమర్చుకున్నాడు. అయితే, వీటిని శాశ్వతంగా లేక తాత్కాలికంగా అమర్చుకున్నాడో చెప్పలేదు. కానీ, తన బంగారు జుట్టు కలను మాత్రం నిజం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మధ్యనే సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు. ఇంతటి విచిత్ర సాహసాన్ని చేసిన అతడెవరో కాదు. ప్రముఖ మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కొంతమంది నెటిజన్లు ‘అతని జుట్టు పీకితేచాలు లైఫ్ సెట్’, ‘గోల్డన్ స్కల్’ అంటూ ఫన్నీ కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. చదవండి: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్ బ్యూటిఫుల్..! -
బోనాల్ వెళ్లే దారి ఇదేనా? మాటల్లోకి దించి చోరి..
సాక్షి, తూప్రాన్(మెదక్): స్కూటీపై వచ్చి దారి అడిగి మహిళ మెడలోచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన ఘటన ఇబ్రహీంపూర్లో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మఠం అనిత వ్యవసాయ పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తుంది. ఈ క్రమంలో చేగుంట నుంచి బోనాల్ వైపు స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అనితను ఆపి బోనాల్ వెళ్లే దారి ఇదేనా అని ప్రశ్నించారు. ఆమె సమాధానం చెబుతుండగానే మెడలోంచి నాలుగు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఏడుస్తూ గ్రామంలోకి వచ్చి విషయం తెలపగా గ్రామ యువకులు రుక్మాపూర్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. చేగుంట వైపు నుంచి వస్తున్న స్కూటీ సీసీ కెమెరాలో రికార్డు కాగా దాని ఆధారంగా చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
ఎలమంచిలి (పశ్చిమగోదావరి): ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ, వ్యసనాలతో పక్కదారి పట్టిన అతడు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును కొట్టేయబోయి స్థానికులకు చిక్కాడు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజా గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే బొరుసు మనోజ్ మద్యం, జూదానికి బానిసగా మారాడు. స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్లకు వచ్చిన అతడు... మంగళవారం సాయంత్రం బైక్‌పై వెళుతూ కాజా గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసు కాజేయబోయాడు. గొలుసు తెగి కిందపడిపోగా, అదే సమయంలో అతడి బైక్ కూడా ఆగిపోయింది. దీంతో స్థానికులు మనోజ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.


