చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ | Software engineer turns as chian snacter | Sakshi
Sakshi News home page

చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Apr 5 2016 8:27 PM | Updated on Sep 3 2017 9:16 PM

చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

చైన్ కొట్టేస్తూ దొరికిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.

ఎలమంచిలి (పశ్చిమగోదావరి): ప్రముఖ బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కానీ, వ్యసనాలతో పక్కదారి పట్టిన అతడు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును కొట్టేయబోయి స్థానికులకు చిక్కాడు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాజా గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసే బొరుసు మనోజ్ మద్యం, జూదానికి బానిసగా మారాడు.

స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం దొడ్డిపట్లకు వచ్చిన అతడు... మంగళవారం సాయంత్రం బైక్‌పై వెళుతూ కాజా గ్రామంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ మహిళ మెడలో బంగారు గొలుసు కాజేయబోయాడు. గొలుసు తెగి కిందపడిపోగా, అదే సమయంలో అతడి బైక్ కూడా ఆగిపోయింది. దీంతో స్థానికులు మనోజ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement