మంచి రక్తప్రసరణ కోసం..! | Health Tips: Yoga Asanas for a Healthier Lifestyle | Sakshi
Sakshi News home page

మంచి రక్తప్రసరణ కోసం..!

Apr 12 2026 10:23 AM | Updated on Apr 12 2026 10:40 AM

Health Tips: Yoga Asanas for a Healthier Lifestyle

మంచి రక్త ప్రసరణకు, మానిసిక ప్రశాంతతకు యోగాలో చాలామంచి ఆసనాలు ఉన్నాయి. అవి క్రమం తప్పకుండా వేస్తుండటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉండటమే కాకుండా మానసికంగానూ బలోపేతం అవుతారని చెబుతున్నారు యోగా నిపుణులు. మరి అవేంటో చూద్దామా..!

మరీచాసనం..
చేయు విధానం.. 
మ్యాట్‌పై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా చాచి దండాసనంలో ఉండాలి. 

ఎడమ కాలిని మడిచి, ఎడమపాదాన్ని కుడితొడపై ఉంచాలి. ∙

ఎడమ మోకాలిని ఎడమచేతితో చుట్టి పట్టుకుని, రెండు చేతులను వెనుకకు తీసుకెళ్లి లాక్‌ చేయాలి. 

శ్వాస తీసుకుంటూ వెన్నెముకను నిటారుగా ఉంచాలి. 

శ్వాస వదులుతూ మెల్లగా కుడి వైపుకు తిరగాలి. ఈ స్థితిలో 10–15 సెకన్లు ఉండాలి. 

తర్వాత మామూలు స్థితికి వచ్చి, మరోవైపు చేయాలి.

ఉపయోగాలు.. 

రక్త ప్రసరణ మెరుగవుతుంది. 

మనసు ప్రశాంతంగా ఉంటుంది. 

వెన్నెముక, నడుము బలపడతాయి. 

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

శరీరం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. 

ఒత్తిడి తగ్గుతుంది.

జాగ్రత్తలు.. 

1. వెన్ను నొప్పి లేదా డిస్క్‌ సమస్యలున్నవారు ఈ ఆసనం చేయకూడదు. 

2. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఈ ఆసనం చేయకూడదు.

– అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌  


ఒత్తిడి పరార్‌
నిత్యం ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పరారవుతుంది. ద్యానం ఒత్తిడిని తగ్గించి.. ఆలోచన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా క్షణాల్లో దానికి పరిష్కారాన్ని వెతకగలిగే సామర్థ్యం మెరుగుపడుతుంది. కనుక ప్రతి రోజూ 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ధ్యానం చేయాలన్నది నిపుణుల సూచన.

(చదవండి: పుష్-అప్స్‌లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్‌ 12 వారాల్లో..)

 

Advertisement
 
Advertisement
Advertisement