ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్‌.. కేటుగాడి మాయ వైరల్‌.. | Digital Number Plate Scam Exposed Telangana | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ చలాన్ల ఎఫెక్ట్‌.. కేటుగాడి మాయ వైరల్‌..

Apr 12 2026 1:50 PM | Updated on Apr 12 2026 2:43 PM

Digital Number Plate Scam Exposed Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొందరు కేటుగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ట్రాఫిక్‌ చలనాలను తప్పించుకునేందుకు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో కారు నంబర్‌ ప్లేట్‌ విషయంలో వెలుగు చూసిన మోసం చూసి పోలీసులే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల మేరకు.. జూబ్లీహిల్స్‌ పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కారు నడుపుతూ ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. దీంతో, కారును పరిశీలించే క్రమంలో కొత్త విషయం తెలుసుకుని పోలీసులే ఖంగుతిన్నారు. సదరు కారుకు నెంబర్ ప్లేటు మార్చే ప్రత్యేక సిస్టమ్ ఉండటంతో పోలీసులు ఒకింత ఆశ్చర్యపోయారు. కొన్ని సెకన్ల వ్యవధిలో కారుకు ఉన్న నెంబర్‌ ప్లేట్‌ మారుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తెలంగాణ, ఢిల్లీలో రిజిస్ట్రేషన్లతో ఉన్న నంబర్‌ ప్లేట్లు మారడం జరుగుతుండటం విశేషం. దీంతో, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement