ఇంటర్నెట్‌ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ! | Bhopal's 90-Degree Bridge To Be Redesigned | Sakshi
Sakshi News home page

ఇంటర్నెట్‌ను ఊపేసిన ‘90-డిగ్రీల’ బ్రిడ్జి ఇక హిస్టరీ!

Apr 12 2026 9:49 AM | Updated on Apr 12 2026 10:17 AM

Bhopal's 90-Degree Bridge To Be Redesigned

భోపాల్‌: సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ‘90-డిగ్రీల వంతెన’ గుర్తుంది కదా? ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ వింత డిజైన్ పై అటు స్థానికుల నుంచి, ఇటు నెటిజన్ల వరకూ తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ), రైల్వే శాఖల కొనసాగుతున్న వివాదానికి ముగింపు దొరికింది. ‘సిమెంట్ తో కట్టిన మృత్యుద్వారం’గా ముద్రపడిన ఈ వంతెన డిజైన్‌ను పూర్తిగా మార్చివేసి, త్వరలోనే సురక్షితంగా తీర్చిదిద్ది, ప్రజల వినియోగానికి తీసుకురావాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు.

భోపాల్ లోని ఐష్‌బాగ్ ప్రాంతంలో సుమారు 18 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి 2025, జూన్ నాటికే పూర్తయినప్పటికీ వాహనాల రాకపోకలకు నోచుకోలేదు. ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు, ఈ వంతెన మలుపు ఏకంగా 90 డిగ్రీల కోణంలో ఉన్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. ఆ మలుపులో వాహనాలు అదుపుతప్పి బోల్తా పడతాయని స్పష్టమైంది. ఈ దారుణమైన ప్లానింగ్ పై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మీమ్స్, విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపధ్యంలో  ఏడుగురు పీడబ్ల్యూడీ ఇంజనీర్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బృందాలను రంగంలోకి దించింది. పక్కనే ఉన్న మెట్రో లైన్ వల్లే డిజైన్ లో ఈ సమస్య తలెత్తిందని దర్యాప్తులో తేలింది. రైల్వే శాఖ నుండి సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే మరో నాలుగు, ఐదు రోజుల్లో పాత కాంట్రాక్టర్‌తోనే మార్పుల పనులు ప్రారంభించనున్నారు. కొత్త డిజైన్ ప్రకారం మలుపు వ్యాసార్ధాన్ని 2 మీటర్ల నుండి 2.5 మీటర్లకు, వంతెన వెడల్పును 8.5 మీటర్ల నుండి 10.5 - 11 మీటర్లకు పెంచనున్నారు. దీని ద్వారా కార్లు, మధ్య తరహా, భారీ వాహనాలు సురక్షితంగా ప్రయాణించే వీలుంటుంది.

ఇది కూడా చదవండి: ట్రంప్ ‘మ్యాజిక్ పెయింట్’.. మండిపడుతున్న నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement