మెయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు | Moinabad Case: Software Engineer Abhishek Singh Arrested | Sakshi
Sakshi News home page

మెయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Mar 21 2026 10:12 AM | Updated on Mar 21 2026 10:51 AM

Moinabad Case: Software Engineer Abhishek Singh Arrested

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అభిషేక్‌ సింగ్‌ను సిట్‌ అదుపులోకి తీసుకుంది. రోహిత్‌ పార్టీకి అభిషేక్‌ సింగ్‌  డ్రగ్స్‌ సరఫరా  చేయగా..  అభిషేక్‌ నుంచి రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ శరత్‌ డ్రగ్స్‌ కొన్నారు. 

రోహిత్‌కు 24 సార్లు అభిషేక్‌  డ్రగ్స్‌ సరఫరా చేశారు. హైదరాబాద్  ఓఆర్‌ఆర్‌ వద్ద రోహిత్ డ్రైవర్ శరత్ కొనుగోలు చేశారు. అభిషేక్‌ సింగ్‌సెల్‌ఫోన్‌ డేటాను సిట్‌ బృందం విశ్లేషిస్తోంది. అభిషేక్ సింగ్ నుండి ఎవరెవరూ డ్రగ్స్ తీసుకున్నారు? అనే విషయంపై సిట్‌ కూపీ లాగుతోంది.

కాగా, డ్రగ్స్‌ కేసు నిగ్గు తేల్చడానికి ఏర్పాటైన సిట్‌ బృందం విచారణను వేగవంతం చేసింది. పలు కీలక విషయాలను సేకరిస్తోంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నిందితులు మూడు రకాల డ్రగ్స్‌ వాడినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement