అభిమానులు మద్దుగా పిలిచే బేబో కరీనా కపూర్ (Kareena Kapoor) ధరించిన కుర్తాసెట్ రాజసం ఉట్టిపడేలా ఆకర్షణీయంగా ఉంది.
భారతీయ హస్తకళ, చేనేత వారసత్వానికి గొప్ప అభిమాని అయిన కరీనా..దాన్ని మన ఫ్యాషన్‌లో ఎలా భాగం చేసుకోవాలో చాలా స్టైలిష్‌గా చూపించారామె.
ఏప్రిల్ 11న ఒక జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్‌కు హాజరైనప్పుడు, కరీనా దేబ్యాని అండ్ కో వారి కలెక్షన్‌లోని 'ఫిలోరి' కుర్తా సెట్‌లో కనిపించారు. దీని ధర ఏకంగా రూ. 98,000 పలుకుతుందట.
ఇది సింధ్ , గుజరాత్‌లలో మూలాలున్న చేనేత వస్త్రం. దీన్ని ముదురు ఇండిగో అజ్రఖ్ ప్రింట్‌తో రూపొందించారు. దీనిపై ఉన్న క్లిష్టమైన జర్దోజీ వర్క్ ఆ కుర్తాని మరింత అందంగా కనిపించేలా చేసింది.


