చిక్కుల్లో వైభవ్‌ సూర్యవంశీ..? | RR Staff Caught Using Mobile Phone In LIVE Match Beside Vaibhav Sooryavanshi, BCCI Rules Explained | Sakshi
Sakshi News home page

చిక్కుల్లో వైభవ్‌ సూర్యవంశీ..?

Apr 11 2026 2:55 PM | Updated on Apr 11 2026 3:24 PM

RR Staff Caught Using Mobile Phone In LIVE Match Beside Vaibhav Sooryavanshi, BCCI Rules Explained

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 10) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆర్సీబీని చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ వీరవిహారం చేసి రాయల్స్‌కు తిరుగులేని విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్‌ మధ్యలో వైభవ్‌ చేసిన ఓ పని​ అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.

మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వైభవ్‌ డగౌట్‌లో కూర్చొని జట్టు మేనేజర్‌ రోమీ భిందర్‌తో కలిసి మొబైల్‌ ఫోన్‌ చూస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. బీసీసీఐ నియమాల ప్రకారం ఆటగాళ్లు మ్యాచ్‌ జరుగుతుండగా మొబైల్‌ చూడరాదు, వాడరాదు. 

మేనేజర్‌కు ఈ విషయంలో వెసులుబాటు ఉన్నా, అతనికి కూడా డగౌట్‌లో మొబైల్‌ వాడే పర్మిషన్‌ లేదు. మేనేజర్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాత్రమే ఫోన్‌ వినియోగించే వెసులుబాటు ఉంది.

ఇప్పుడు డగౌట్‌లో మొబైల్‌ వాడినందుకు మేనేజర్‌తో పాటు వైభవ్‌ కూడా చిక్కుల్లో పడినట్లైంది. వైభవ్‌ స్వతహాగా మొబైల్‌ వాడనప్పటికీ, దానివైపు చూస్తున్నట్లు సోషల్‌మీడియాలో సర్కులేట్‌ అవుతున్న వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయంలో మేనేజర్‌తో పాటు వైభవ్‌ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో చూడాలి.

ఈ అంశానికి సంబంధించి బీసీసీఐ నియమాలు (PMOA – Minimum Standards for Players and Match Officials Areas) ఇలా ఉన్నాయి.

- మొబైల్‌ ఫోన్లు, కమ్యూనికేషన్‌ డివైజ్‌లు డగౌట్‌లో అనుమతించబడవు.  
- టీమ్‌ మేనేజర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాత్రమే ఫోన్‌ వాడవచ్చు, డగౌట్‌లో కాదు.  
- అనలిస్టులు కంప్యూటర్లు వాడవచ్చు, కానీ కేవలం ప్రత్యేకంగా కేటాయించిన అనలిస్ట్‌ టేబుల్‌ వద్ద మాత్రమే.  
- ఆటగాళ్లు, సపోర్ట్‌ స్టాఫ్‌ స్టేడియంలోకి వచ్చిన వెంటనే తమ డివైజ్‌లను ఆఫ్‌ చేసి సురక్షితంగా భద్రపరచాలి.  
- అటెండెంట్స్‌, క్యాటరింగ్‌ వర్కర్స్‌ వంటి సిబ్బంది కూడా కమ్యూనికేషన్‌ డివైజ్‌లు తీసుకురావడానికి అనుమతి లేదు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement