
వలన కూలీ అకృత్య
కర్ణాటక: తన భార్య అశ్లీల వీడియోను సేకరించిన సహ కార్మికున్ని ఇనుప రాడ్ కొట్టి చంపాడో వలస కార్మికుడు. మంగళూరు నగరంలో సూరత్కల్లో ఈ ఘోరం జరిగింది. వివరాలు.. పశ్చిమ బెంగాల్ చెందిన ముఖేశ్ మండల్ (27) హతుడు. ఇతడు లక్ష్మణ్ అలియాస్ లఖన్ (30) భార్య అశ్లీల వీడియోను తీసుకొని తన ముబైల్ ఫోన్లో పెట్టుకున్నాడు.
ఈ విషయం లక్ష్మణ్‌కు తెలిసింది. ' దీంతో జూన్ 24న రాత్రి ఇద్దరూ బాగా మద్యం తాగారు. మత్తులో ఉండగా ఇనుప రాడ్ బాది హత్య చేసి, శవాన్ని ఓ సెప్టిక్ ట్యాంకులో పడేశాడు. ఆగస్ట్ 21న మృతదేహాన్ని కుళ్లిన స్థితిలో పోలీసులు కనుగొన్నారు. హంతకుడు లక్ష్మణ్ తమిళనాడులో దాగి ఉండగా సూరత్కల్ పోలీసులు వెతికి పట్టుకున్నారు.