
కాఠ్మాండు: నేపాల్ రాజధాని కాఠ్మాండులో జరిగిన ఘోర ఘటన కలకలం రేపుతోంది. ఆందోళన కారులు నేపాల్ రాజధాని కాఠ్మాండూలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్ ఆందోళనకారుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
సోషల్ మీడియా,అవినీతికి వ్యతిరేకంగా జనరేషన్ జెడ్ చేపట్టిన ఉద్యమంతో ప్రధాని కేపీ ఓలీ రాజీనామా చేశారు. మాజీ ప్రధాని కేపీఓలీతో పాటు పలువురు మంత్రులు దేశం విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కాఠ్మాండూలోని డల్లూ ప్రాంతంలో మాజీ ప్రధాని జాలనాథ్ ఖనాల్ ఇంటిని ముట్టడించారు. ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి చిత్రకార్‌ను ఇంట్లో బంధించి, ఇంటికి నిప్పుపెట్టారు. మంటల్లో చిక్కుకున్న రాజ్యలక్ష్మిని కిర్తిపూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.
మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై రాజకీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.జెనరేషన్ జెడ్ ఆందోళనలతో నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో పలువురు జెనరేషన్ జెడ్ ఆందోళనల్ని సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకిస్తున్నారు. మాజీ ప్రధాని ఖనాల్ సతీమణి రాజ్యలక్ష్మి మరణంపై ‘మానవత్వానికి మాయన మచ్చ’అంటూ కామెంట్లు చేస్తున్నారు.