డెత్ సర్టీఫికెట్‌లో భర్తకు బదులుగా
భార్య పేరు చేర్చిన అధికారులు
అలీగఢ్: అధికారిక రికార్డుల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాకు చెందిన 58 ఏళ్ల సరోజ్ దేవి మూడేళ్ల క్రితమే చనిపోయింది..! అసలు చనిపోయింది నా భర్త..నేను కాదు మొర్రో.. అని అప్పటి నుంచి ఆమె అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటూనే ఉంది. ఎవరూ ఆమె గోడును పట్టించుకున్న పాపాన పోలేదు.
చమర్ నగారియా గ్రామానికి చెందిన జగదీశ్ ప్రసాద్ 2020లో చనిపోయాడు. స్థానిక క్లర్కు ఒకరు మృతుల జాబితాలో జగదీశ్ ప్రసాద్ బదులుగా అతడి భార్య సరోజ్ దేవి చనిపోయినట్లుగా 2022 జనవరి ఒకటో తేదీన నమోదు చేసుకున్నాడు.
అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. సరోజ్ దేవి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ అయ్యింది. గుర్తింపునకు సంబంధించిన ఇతర ఆధారలేవీ ఆమెకు లేకుండాపోయాయి. అప్పటి నుంచి ఆమె అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. మూడేళ్లయినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. చివరికి ఈ నెల 15వ తేదీన ఖైర్ సబ్ విడిజనల్ మేజి్రస్టేట్ శిశిర్ కుమార్‌కు తెహశీల్ దివస్ సందర్భంగా సరోజ్ దేవి తన సమస్యను వివరించింది.
తన గుర్తింపును పునరుద్ధరించాలని, తనను తిరిగి బతికించాలని కోరింది. ఎట్టకేలకు ఆయన స్పందించారు. ప్రాధా న్యం కలిగిన అంశంగా భావించి, పరిష్కా రానికి అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. రికార్డుల్లో ఇందుకు అవసరమైన దిద్దుబాట్లు చేపట్టామని శిశిర్ కుమార్ తెలిపారు. సమస్య పరిష్కారమై సరోజ్ దేవి త్వరలోనే ప్రభుత్వ రికార్డుల్లో సజీవురాలు అవ్వాలని ఆశిద్దాం.!


