షాబాద్ హత్యలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు | Harish Rao makes sensational comments on the Shabad murders | Sakshi
Sakshi News home page

షాబాద్ హత్యలపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Jul 13 2026 3:44 PM | Updated on Jul 13 2026 4:02 PM

 Harish Rao makes sensational comments on the Shabad murders

షాబాద్ నరరూప రాక్షసుడు రాజ్ కుమార్  కేసు విషయంలో మాజీ మంత్రి హరీష్‌ రావు సంచలన ఆరోపణలు చేశారు. "సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకొని ఆరుహత్యల నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్టు కాకుండా కాపాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్  అండదండలతో పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయకుండా 45 రోజులు టైమ్ ఇచ్చి కాపాడారు. ఈలోపు నిందితుడు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకొని ఆరుగురిని హత్య చేశాడు"  అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ స్పోక్స్‌పర్సన్ నాగార్జున యాదవ్ అనే నాయకుడు రేవంత్ రెడ్డిని పెయింట్ వేస్తారు  అన్నందుకే ఆయనను అరెస్ట్ చేశారని, నల్లబాలు ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తే పోలీసులు అతనిని జైలుకు తరలించారు. కానీ రేప్ చేసిన నిందితుడు రాజ్ కుమార్‌ను అరెస్ట్ చేయకుండా, అతడితో  కూర్చొని పోలీసులు మందు తాగారు అని హరీశ్‌ రావు ఆరోపించారు.

కాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబాద్ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆ హంతకుడి కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఎటువంటి పుకార్లు నమ్మవద్దని ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement