షాబాద్‌ హత్యలకు ముందు సెల్ఫీవీడియో | Selfie video of the accused in the Shabad murders | Sakshi
Sakshi News home page

షాబాద్‌ హత్యలకు ముందు సెల్ఫీవీడియో

Jul 13 2026 6:17 PM | Updated on Jul 13 2026 7:31 PM

Selfie video of the accused in the Shabad murders

సాక్షి, హైదరాబాద్: షాబాద్‌ నరహంతకుడు రాజ్ కుమార్‌ కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. హత్యలకు ఒక రోజు ముందు నిందితుడు తన ఫోన్‌లో ఒక సెల్ఫీ వీడియో తీసినట్లు తెలిపారు.. అందులో " నేను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయా, ఆ కుటుంబం నన్ను అన్ని విధాలా వాడుకుంది. నాపై కేసు పెట్టి నన్ను మోసం చేశారు. అందుకే వాళ్లని చంపాలనుకున్నా చివరకి నా పిల్లలకి కూడా భూమి లేకుండా పోయింది. డబ్బుమెుత్తం ఇచ్చేసి అప్పులపాలయ్యాను జీవితం మీద విరక్తి కలిగింది." అని రికార్డు చేసినట్లు తెలిపారు.

షాబాద్‌ నిందితుడు ఆత్మహత్య చేసుకుని  మృతి చెందిన అనంతరం అతని వద్ద లభించిన మొబైల్‌ ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

దీనిలో భాగంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. "ఆ ఘటన జరిగిన రోజు 10.30 గంటల ప్రాంతంలో నిందితుడు రాజ్‌ కుమార్ ఉర్లోకి వచ్చాడు. అమ్మాయిని తీసుకొని దేవరకొండకు వచ్చాడు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. జీపీఎస్ ఆధారంగా పట్టుకునేందుకు యత్నించాము" అని సీపీ పేర్కొన్నారు.

కాగా షాబాద్‌ హత్య కేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతిచెందాడు. కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. షాబాద్‌ మండలం దైవాలగూడ సామూహిక హత్యల కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్‌ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతున్న సమయంలో అతని మృతదేహం లభించడం చర్చనీయాంశమైంది.

రాజ్‌కుమార్‌ మృతదేహం పక్కన పాయిజన్‌ బాటిల్‌ కనబడింది. ఎలాగైనా పోలీసులు పట్టుకుంటారని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని  పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement