breaking news
rajivgandhi airport
-
శంషాబాద్.. ఫ్యామిలీ ఫ్రెండ్లీ
హైదరాబాద్, శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత కుటుంబాలకు అనుకూలమైన ఎయిర్‌పోర్టు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్‌గా నాలుగో ర్యాంకును దక్కించుకుంది. యూకేకు చెందిన ప్రముఖ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడర్ అట్రాక్షన్ టికెట్స్ డాట్‌కామ్ హ్యాపియెస్ట్ ఎయిర్‌పోర్టు కింద వివిధ ప్రమాణాలను పరిశీలించి ఈ గుర్తింపును అందజేసినట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.మొత్తం 20 మార్కులకు గాను 18.5 లభించాయని పేర్కొన్నాయి. కుటుంబాలకు ప్రత్యేక భద్రత, శిశు సంరక్షణ సదుపాయాలు, విశ్రాంతి సేవలు, పిల్లల ఆటస్థలాలతో పాటు వైఫై ఇతరత్రా అనేక సౌకర్యాలతో గూగుల్ రేటింగ్లను పరిగణనలోకి తీసుకుని ర్యాంకును అందజేసినట్లు తెలిపారు. ఈ గుర్తింపు గర్వకారణమని జీహెచ్‌ఏఐఎల్ లిమిటెడ్ సీఈఓ కదీర్ కదరవన్ అన్నారు. -
'ఎయిర్‌పోర్టు పేరు మారిస్తే ఉద్యమాలు చేస్తాం'
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ పేరును మార్చి..ఎన్టీఆర్ పేరు పెడితే ఉద్యమాలు చేస్తామని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హెచ్చరించారు. ఆ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు.ఈ రోజు తెలంగాణ టి.కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో పొన్నాల ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ నేత ఎన్నిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే అప్పగిస్తూ ఈ భేటీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పొన్నాల.. ఎయిర్ పోర్టుకు పేరు మార్చి యోచన మంచి పద్దతి కాదని తెలిపారు. దీనిపై కేంద్రం ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. పోలవరం ఆర్డినెన్స్ అప్రజాస్వామికమని ఆయన అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌ను కేంద్రం వెంటనే నిలిపివేయాలన్నారు.


