breaking news
Toy cars
-
సీఎం విజయ్‌కు బొమ్మ కారు గిఫ్ట్.. ఎవరిచ్చారంటే?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, అధికారిక కార్యక్రమాల వల్ల మాత్రమే కాకుండా.. ఆయన సహజమైన, సరదా క్షణాల వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా.. వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ ఆసియా ఆపరేషన్స్ సీఈఓ ఫామ్ సాన్ చౌ (Pham Sanh Chau)తో జరిగిన సమావేశం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఈ సమావేశంలో విన్‌ఫాస్ట్ కంపెనీ ప్రతినిధి.. ముఖ్యమంత్రి విజయ్‌కు తమ కంపెనీకి చెందిన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు స్కేల్ మోడల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ చిన్న కారు బొమ్మను విజయ్ తీసుకుని, పక్కన పెట్టకుండా ఆసక్తిగా చేతిలో పట్టుకుని పరిశీలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.చాలామంది నెటిజన్లు విజయ్ అమాయకత్వాన్ని, సరళ స్వభావాన్ని ప్రశంసించారు. కొందరు ఆయన ఆ చిన్న కారును ఎంతో ఆసక్తిగా చూస్తున్న తీరు చాలా క్యూట్‌గా ఉందని, చిన్నపిల్లాడిలా ఆనందపడ్డారని కామెంట్లు చేశారు.నిజానికి సీఎం విజయ్‌కు ఇచ్చిన టాయ్ కారు విన్‌ఫాస్ట్ వీఎఫ్8 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి చెందిన చిన్న నమూనా. దీనిని కంపెనీ పిల్లలు ఆదుకునే బొమ్మగా కాకుండా.. తమ వాహనాలను ప్రచారం చేయడానికి లేదా ప్రత్యేక అతిథులకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి రూపొందించింది.విన్‌ఫాస్ట్ వీఎఫ్8 గురించిఅసలైన విన్‌ఫాస్ట్ వీఎఫ్8 ఎలక్ట్రిక్ కారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో తరం. ఇది 60.13 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 228 హార్స్పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 500 కిమీ ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది.#CMVijay's cute playtime with a Miniature Toy Car... 🤎🚗 pic.twitter.com/dmrxMCbeO2— 𝐒𝐚𝐤𝐭𝐡𝐢 𝐀𝐠𝐫𝐢 𝑻𝑽𝑲 (@mersal_sakthi03) July 13, 2026 -
దటీజ్...దటూక్...!
కొన్ని రోజులుగా మలేసియా రాజధాని కౌలాలంపూర్ రోడ్లపై ఒక విచిత్రమైన కారు షికార్ చేస్తోంది. ఆ కారును చూసిన వాళ్లందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ అంతలా అందరినీ అబ్బురపరుస్తున్న ఆ కారు ప్రత్యేకత ఏంటంటే... ఆ కారుపై వేలకొద్దీ బొమ్మ కార్లు అంటించి ఉన్నాయి. మొదట్లో దాన్ని గమనించిన ప్రజలు అది ఏదో మార్కెటింగ్ స్టంట్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత విషయం తెలుసుకున్న వారు ఇదెక్కడి పిచ్చిరా బాబు అని చెవులు కొరుకుంటున్నారు. హరియన్ మెట్రో వారు ఆ కారు, ఆ కారుపై ఉన్న బొమ్మ కార్లు దానివెనుకున్న రహస్యాన్ని ఛేదించారు. జాగ్వార్ కంపెనీకి చెందిన ఆ కారు యజ మాని ఒక వ్యాపారవేత్త. అతని పేరు దటూక్ సేరి మహదీ బద్రుల్ జమాన్. అతనికి కార్లంటే పిచ్చి ఎక్కువ. ఆ మక్కువతోనే తన 13 ఏట నుంచి బొమ్మ కార్లను సేకరించేవాడు. అలా ఇప్పటికి 5 వేల కార్లను సేకరించాడు. తన జాగ్వార్ అందరి కార్ల కంటే కొంచెం విభిన్నంగా ఉండాలని భావించిన మహదీ తాను సేకరించిన 4,600 బొమ్మ కార్లను అంటించి మురిసిపోయాడు. -
కిడ్స్ ప్లే అండ్ బెడ్
పిల్లలకు ఆటలే లోకం. వినూత్నమైనది ఏం కనిపించినా పిల్లల మనసు దోచేస్తుంది. ఆడుకునే బొమ్మలంటే మరింత ఇష్టం. అందులోనూ ఆ బుల్లి ప్రపంచంలో బొమ్మ కార్లు, బస్సులు దూసుకొస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అందుకే కారు బొమ్మ ఉన్న డ్రెస్ కావాలంటారు.. రైల్ బొమ్మలా ఉండే టిఫిన్ బాక్స్ కొనివ్వమంటారు. ఇలాంటి చిన్నారుల సంతోషాన్ని రెట్టింపు చేయడానికి బుల్లికార్లు.. విమానాలు.. జీపుల రూపంలో ఉన్న బెడ్స్ సిటీ మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ తరం పేరెంట్స్ పిల్లలు ఏది కోరుకున్నా నిమిషాల్లో తెచ్చిస్తున్నారు. ఇంట్లోనే తమ పిల్లల కోసం అందమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా మార్కెట్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తున్నాయి. చిన్నారుల ఆనందమే టార్గెట్‌గా కారు, జీపు, బస్సు ఇలా అన్ని రకాల మోడల్స్‌లో చిల్డ్రన్స్ బెడ్స్ మార్కెట్లోకి తీసుకొచ్చేశాయి. సిటీ మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ బెడ్స్ పిల్లలతో పాటు పేరెంట్స్‌ను కూడా తెగ ఆకర్షిస్తున్నాయి. తల్పం.. గిల్పం.. పిల్లల కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ తల్పాలు.. గిల్పాలను తలదన్నేలా ఉన్నాయి. వాహనాల ఆకారంలో ఉన్న ఈ బెడ్స్‌పై పడుకుంటే పిల్లలు పొందే ఆనందమే వేరు. వీటి కలర్ కాంబినేషన్ కూడా చిన్నారుల మనసులను దోచేస్తున్నాయి. కొన్ని బెడ్స్‌కు వీల్స్ కూడా అమర్చడంతో అచ్చంగా ఓపెన్ టాప్ కార్లను తలపిస్తూ ఆనందం పంచుతున్నాయి. వెరైటీ మోడల్స్.. నగరంలో కిడ్స్ షోరూమ్‌లో ఈ ఫోర్ వీలర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా వెరైటీలు కావాలనుకుంటే ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నవారి కోసం ఫోర్ వీల్స్ బంక్బెడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెటల్, ఫైబర్, వుడ్‌తో ఇవి రూపొందుతున్నాయి. ఇక వెరైటీలను బట్టి వీటి ధరలు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి. - విజయారెడ్డి


