కిడ్స్ ప్లే అండ్ బెడ్ | Kids have interest to play & Bed city market | Sakshi
Sakshi News home page

కిడ్స్ ప్లే అండ్ బెడ్

Nov 2 2014 3:23 AM | Updated on Sep 2 2017 3:43 PM

కిడ్స్ ప్లే అండ్ బెడ్

కిడ్స్ ప్లే అండ్ బెడ్

పిల్లలకు ఆటలే లోకం. వినూత్నమైనది ఏం కనిపించినా పిల్లల మనసు దోచేస్తుంది.

పిల్లలకు ఆటలే లోకం. వినూత్నమైనది ఏం కనిపించినా పిల్లల మనసు దోచేస్తుంది. ఆడుకునే బొమ్మలంటే మరింత ఇష్టం. అందులోనూ ఆ బుల్లి ప్రపంచంలో బొమ్మ కార్లు, బస్సులు దూసుకొస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. అందుకే కారు బొమ్మ ఉన్న డ్రెస్ కావాలంటారు.. రైల్ బొమ్మలా ఉండే టిఫిన్ బాక్స్ కొనివ్వమంటారు. ఇలాంటి చిన్నారుల సంతోషాన్ని రెట్టింపు చేయడానికి బుల్లికార్లు.. విమానాలు.. జీపుల రూపంలో ఉన్న బెడ్స్ సిటీ మార్కెట్‌లోకి వచ్చేశాయి.
 
ఈ తరం పేరెంట్స్ పిల్లలు ఏది కోరుకున్నా నిమిషాల్లో తెచ్చిస్తున్నారు. ఇంట్లోనే తమ పిల్లల కోసం అందమైన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా మార్కెట్ వర్గాలు కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తున్నాయి. చిన్నారుల ఆనందమే టార్గెట్‌గా కారు, జీపు, బస్సు ఇలా అన్ని రకాల మోడల్స్‌లో చిల్డ్రన్స్ బెడ్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేశాయి. సిటీ మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఈ స్పెషల్ బెడ్స్ పిల్లలతో పాటు పేరెంట్స్‌ను కూడా తెగ ఆకర్షిస్తున్నాయి.
 
తల్పం.. గిల్పం..

పిల్లల కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఈ తల్పాలు.. గిల్పాలను తలదన్నేలా ఉన్నాయి. వాహనాల ఆకారంలో ఉన్న ఈ బెడ్స్‌పై పడుకుంటే పిల్లలు పొందే ఆనందమే వేరు. వీటి కలర్ కాంబినేషన్ కూడా చిన్నారుల మనసులను దోచేస్తున్నాయి. కొన్ని బెడ్స్‌కు వీల్స్ కూడా అమర్చడంతో అచ్చంగా ఓపెన్ టాప్ కార్లను తలపిస్తూ ఆనందం పంచుతున్నాయి.
 
వెరైటీ మోడల్స్..
నగరంలో కిడ్స్ షోరూమ్‌లో ఈ ఫోర్ వీలర్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. చాలా వెరైటీలు కావాలనుకుంటే ఆన్‌లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నవారి కోసం ఫోర్ వీల్స్ బంక్‌బెడ్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మెటల్, ఫైబర్, వుడ్‌తో ఇవి రూపొందుతున్నాయి. ఇక వెరైటీలను బట్టి వీటి ధరలు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతున్నాయి.

 - విజయారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement