Telangana: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి | 3 Months Ration Rice at Once from August 2026 | Sakshi
Sakshi News home page

Telangana: మళ్లీ 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి

Jul 20 2026 9:35 AM | Updated on Jul 20 2026 10:00 AM

3 Months Ration Rice at Once from August 2026

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఆగస్టు, సెపె్టంబర్, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన సన్న బియ్యం ఒకేసారి ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లలో నిమగ్నం అయింది.  

ఒక్కొక్కరికి 18 కిలోలు 
జిల్లాలో ఉన్న 520 రేషన్‌ దుకాణాల ద్వారా తెల్లకార్డుదారులకు మూడు నెలలకు సంబంధించి రేషన్‌ బియ్యం ఆగస్టులో ఇవ్వనున్నారు. వేసవికి ముందు ఏప్రిల్, మే, జూన్‌ మాసాలకు సంబంధించిన రేషన్‌ బియ్యం లబి్ధదారులకు ఒకేసారి పంపిణీ చేశారు. ఇక ఈ నెలకు సంబంధించి బియ్యం ఒకసారి ఇచ్చారు. మళ్లీ ఆగస్టులో మరో మారు మూడు నెలల కోటా ఇవ్వనున్నారు. ఈనెలకు సంబంధించిన రేషన్‌ కోటా పంపిణీ పూర్తి కావడంతో 20 నుంచి నెలాఖరులోగా జిల్లా పరిధిలో ఉన్న రేషన్‌ దుకాణాలకు బియ్యం స్టాక్‌ పంపిస్తామని అధికారులు వెల్లడించారు. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున 18 కిలోల సన్నబియ్యం అందజేయనున్నారు.  

ఆందోళనలో రేషన్‌ డీలర్లు 
మూడు నెలల రేషన్‌ బియ్యం కోటా ఒకే సారి విడుదల చేస్తుండటంతో తమకు శ్రమ అధికమవుతుందని రేషన్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న షట్టర్లలో ఉన్న రేషన్‌ దుకాణాల్లో నిల్వ సామర్థ్యం లేకపోవడం, మూడు నెలల కోటా పట్టకపోవడం వంటి సమస్యలు నెలకొన్నాయి. దీంతో పాటు తూకంలో తరుగు వస్తుందని వారు వాపోతున్నారు. గతంలో కూడా రెండుసార్లు ఇచి్చన రేషన్‌ కోటాలో తరుగు వచ్చి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్‌వర్క్‌ సమస్యతో ఈ– పాస్‌ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో వినియోగదారులు మూ డుసార్లు వేలిముద్రలు పెట్టడం కష్టతరమవుతుంది. దీంతో ఒక్కో వినియోగదారుడికి కనీసం 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.        

   ఏర్పాట్లు చేస్తున్నాం 
వినియోదారులకు జూలై నెలకు సంబంధించి రేషన్‌ బియ్యం పంపిణీ పూర్తయింది. ఆగస్టులో మూడు నెలల కోటా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈనెల 20 నుంచి జిల్లా పరిధిలోని రేషన్‌ దుకాణాలకు బియ్యం స్టాక్‌ తరలిస్తాం. వినియోగదారులు సహకరించాలి. 
– జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement