నల్లగొండ: విధుల్లో ఉండి చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు కానిస్టేబుల్‌పైనే పోక్సో కేసు నమోదవడం జిల్లాలో సంచలనంగా మారింది. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, సైకిల్‌పై వెళ్తున్న బాలికను నిందితుడు అడ్డగించి అసభ్యంగా తాకి వేధించించాడు . ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి పలుచోట్ల సంచరించాడు, పోలీస్‌లు సీసీటీవీ దృశ్యాల సహాయంతో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉండగా, గతంలో నకిరేకల్‌లో విధులు నిర్వహించిన సమయంలో కూడా అతడిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల కూడా నీచంగా ప్రవర్తించే వాడని ఆరోపణలు ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


