సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి కొణిదెల చిరంజీవి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో నమోదైన రెండు కేసులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు డీప్‌ఫేక్‌పై శనివారం, అభ్యంతరకర వ్యాఖ్యపై మంగళవారం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోని నిందితులను గుర్తించడానికి దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.


