భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది | apoorva reddy inspiring journey from struggles to si | Sakshi
Sakshi News home page

భర్త లేకపోయినా.. బాధ్యత నెరవేర్చింది

May 11 2026 1:54 PM | Updated on May 11 2026 2:47 PM

apoorva reddy inspiring journey from struggles to si

బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన గూడ లావణ్య – కీ.శే. భూపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు అపూర్వ, కుమారుడు అశ్విష్‌రెడ్డి. కూతురు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతుండగా, లావణ్య భర్త భూపాల్‌రెడ్డి ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌తో మృతి చెందాడు. 

అయినప్పటికీ, తల్లి లావణ్య మనోస్థైర్యంతో తన పిల్ల లను చదివించింది. అపూర్వ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ కష్టపడి చదివి ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా పని చేస్తున్నారు. కష్టాలు, కన్నీళ్లు ఎన్ని ఎదురైనా మనోధైర్యం, గుండె నిబ్బరం వీడకుండా ముందుకు సాగాలని, తన తల్లే తనకు ఆదర్శమని ఎస్సై అపూర్వరెడ్డి చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement