మహిళా పోలీస్‌స్టేషన్‌కు పెరుగుతున్న ఫిర్యాదులు
పెళ్లయిన ఏడాదిలోపే పోలీసులను ఆశ్రయిస్తున్న వైనం
అనుమానం, వివాహేతర సంబంధాలతో పెరుగుతున్న గొడవలు
వారిది పెద్దలు కుదిర్చిన పెళ్లిసంబంధం. యువ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా, భర్త ఆఫీస్ పోయేటప్పుడు భార్య ఆ రోజు వరకు ఉన్న ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాలింగ్ ఎంత ఉందో నోట్ చేసుకోవడంతో పాటు, కాస్త ఆలస్యంగా వచ్చినా.. ఆఫీసుకు సెలవు పెట్టి బయటకు వెళ్లినా అనుమానించడం సాధారణమైంది. తనతో పెళ్లి ఇష్టం లేకే ఇలా చేస్తోందని భర్త భావించాడు. అసలు విషయమేమిటో బోధపడక ముందు వీరి పంచాయితీ పెద్దల వరకు, అట్నుంచి మహిళ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.
ఇద్దరు ఉన్నత చదువులు పూర్తి చేశారు. మంచి ఉద్యోగాల్లో స్థిర పడ్డారు. సోషల్‌మీడియాలో ఏర్పడిన స్నేహం పెళ్లివరకు వచ్చింది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన ఇద్దరి మధ్య నెలకొన్న అనుమానాలతో ఆరు నెలలకే వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఠాణాకు చేరారు. ఇలా పెరిగిన సోషల్‌మీడియా వినియోగం, మైక్రో కుటుంబాలతో సర్ది చెప్పేవారు లేక కుటుంబాలు కూలుతున్నాయి.
సాక్షి పెద్దపల్లి: నూరేళ్లు సాఫీగా సాగాల్సిన భార్యాభర్తల జీవితం పట్టుమని నెలలు కూడా ఉండట్లేదు. అనుమానం, వివాహేతర సంబంధాలు, అదనపు కట్నం, చిన్నపాటి తగాదాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కారణాలు ఏవైనా.. కారకు లు ఎవరైనా.. అన్నింటా ఆమే సమిదగా మారు తోంది. వేధింపులు, చిత్రహింసలు, భరించలేని స్థాయికి చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోజుకు పదుల సంఖ్యలో జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. మద్యానికి బానిసవడం, అదనపు కట్నం, ఆస్తి కోసం ఇలా కారణమేదైనా మహిళకు వేధింపులు తప్పడం లేదు. మరికొన్ని కేసుల్లో ఆలుమగల మధ్య తలెత్తిన గొడవలను సరిదిద్దాల్సిన పెద్దలు రెచ్చగొడుతున్నారు. తమవారిదే పైచేయి కావాలనే పట్టుదలతో దంపతుల మధ్య ఎడబాటు పెంచుతున్నారు. మూడో వ్యక్తి జోక్యంతోనే సంసారాన్ని చేతులారా చేసుకుంటున్నారని సైకాలజిస్టులు నాశనం చెబుతున్నారు.
నాలుగు నెలల్లో..
జిల్లాలోని మహిళా సంబంధిత కేసుల సత్వర పరిష్కారం కోసం జిల్లాకేంద్రంలో మహిళ పోలీస్ స్టేషన్‌కు జూన్‌లో ప్రారంభించారు. 144 రోజుల్లో 475 కేసులు నమోదు కాగా, అందులో 395 కేసులను పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్క రించారు. 45 మందిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేయ గా, 90మంది కేసులను విత్ర్‌డా చేసుకున్నారు. ఈ పోలీస్ స్టేషన్ ను రోజూ పదుల సంఖ్యలో బాధితులు ఆశ్రయిస్తున్నారంటే సమస్య ఏస్థాయిలో ఉందో ఆర్థం చేసుకోవచ్చు. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆధిపత్య ధోరణి, పెద్దల జోక్యం, అనుమానాలతో రాణా మెట్లు ఎక్కుతున్నారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే?
కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులు కనిపించవు. కానీ, ఒకరికొకరు బద్ద శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో పది, ఇరవై ఏళ్లుగా సంసారం చేసేవారు తక్కువగా ఉంటున్నారు. అధికశాతం పెళ్లయిన ఏడాది నుంచి మూడేళ్ల లోపువారే ఎక్కువ గా స్టేషన్ ను ఆశ్రయిస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పంథాలకు పోతున్నారు. ఎక్కువగా మొబైల్ వినియోగం పెరగడం, భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవలను భూతద్దంలో చూడడం తో అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతు న్నారు. వారికి దశల వారీగా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ సాధ్యమైనంత వరకు ఇద్దరినీ కలిపేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తున్నాం
ప్రధానంగా మద్యం కారణంగా గొడవలు, వరకట్న వేధింపులు, అనుమానాలతో గొడవ లు పడుతున్న కేసులు ఎక్కువగా వస్తు న్నాయి. సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే దంపతులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం. ఆలుమ గల బంధం ఎంతో పవిత్రమైంది. ఏమైనా
సమస్యలుంటే పరిష్కరించుకోవాలి.
- కె.పురుషోత్తం, సీఐ, మహిళా పోలీస్ స్టేషన్


