
ధనవంతుడైన ఒక దొంగకు ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఒక ఇంటిని చూపిస్తూ ఇలా అంటున్నాడు.. ‘‘ఇంటి ముందు ‘మా జైలుకు స్వాగతం’ అనే బోర్డు పెట్టుకుంటే భలే ఉంటుంది సార్. అలాగే, కాలింగ్ బెల్లుకు బదులు ఇక్కడ ఒక జైల్ అలారం పెట్టించుకుంటే ఇంకా సూపర్. అలాగే మీకోసం ఒక పెద్ద సెల్‌లో మాస్టర్ బెడ్‌రూమ్‌ను డిజైన్ చేసుకోవచ్చు. అతిథులు వస్తే, వాళ్లకోసం నెంబర్ వైజ్డ్ రిమాండ్ రూమ్స్ కూడా ఉన్నాయి.
అతిథులతో మీకు ఇబ్బంది రాకుండా, వారిని వెంటనే ఇంటి నుంచి వెళ్లగొట్టగలిగేలా రూమ్స్‌లో అద్భుతమైన చెక్క మంచాలు ఉన్నాయి. వాటిని మీకు స్పెషల్ డిస్కౌంట్ కింద ఫ్రీగా ఇస్తాం. ఎప్పుడైనా పిల్లలు మొండిగా ప్రవర్తిస్తుంటే, క్రమశిక్షణలో పెట్టడానికే పక్కనే సిద్ధంగా ఒక లాకప్ రూమ్ కూడా ఉంది’’ అని వివరిస్తున్నాడు. ఇదంతా ఆ రిచ్ చోర్, తనను మెప్పించడానికే ఇలా చెప్తున్నాడేమో అనుకున్నాడు.
కాని, అతను వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇలాగే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఆ ఇల్లు నిజంగానే ఒక జైలు కాబట్టి. ఈ అద్భుతమైన జైలును సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే, ఇంగ్లండ్‌లోని డోర్సెట్‌కు వెళ్లాలి. 1899లో నిర్మించిన స్వానేజ్ పోలీస్ స్టేషన్ ప్లస్ జైలును, అక్కడి ప్రభుత్వం 1.2 మిలియన్ పౌండ్స్ (అంటే రూ. 13 కోట్లు )కు వేలానికి పెట్టింది. లైఫ్‌లాంగ్ లాకప్‌కు సిద్ధంగా ఉన్నవారు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. త్వరపడండి!
(చదవండి: ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..! రీజన్ తెలిస్తే షాకవ్వుతారు..)