పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్‌పేట లాడ్జ్‌కి తీసుకెళ్లి.. | Zero FIR Filed On Man In Madhura Nagar Police Station For Cheating Woman | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. అమీర్‌పేట లాడ్జ్‌కి తీసుకెళ్లి..

Jun 26 2025 8:05 AM | Updated on Jun 26 2025 10:09 AM

Zero FIR In Madhura Nagar Police Station

హైదరాబాద్: యువతిని మోసం చేసి బాబు పుట్టాక ముఖం చాటేసిన యువకుడిపై మధురానగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు..రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి షాద్‌నగర్‌ కాలేజీలో డిగ్రీ చదివే సమయంలో సీనియర్‌ ద్వారా అయిన భరత్‌రెడ్డి పరిచయమయ్యాడు. గత ఏడాది యువతిని అమీర్‌పేట ఓయో రూంలో బలవంతంగా కలిశాడు.గర్భవతినని ఆమె భరత్‌రెడ్డికి చెప్పగా పెళ్ళి చేసుకుందామని చెప్పాడు.ఆ తరువాత ఆమెకు బాబు పుట్టాడు. దీంతో బాధితురాలుషాద్‌నగర్‌లోని భరత్‌రెడ్డి ఇంటికి వెళ్ళగా  దుర్బాషలాడి పంపారు. తనను మోసం చేసిన భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మధురానగర్‌ పీఎస్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎస్‌ఆర్‌నగర్‌కు పంపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement