నా కోడిని చంపినోళ్లను వదలొద్దు | Woman Files Police Complaint Over Poisoned Kodi | Sakshi
Sakshi News home page

నా కోడిని చంపినోళ్లను వదలొద్దు

May 29 2026 1:54 PM | Updated on May 29 2026 1:54 PM

Woman Files Police Complaint Over Poisoned Kodi

నల్గొండ జిల్లా: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కింది. 

జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement