పోలీసుస్టేషన్‌కు వచ్చిన నాగుపాము | Cobra Sparks Panic At Ganneruvaram Police Station, SI Narrowly Avoids Danger | Sakshi
Sakshi News home page

పోలీసుస్టేషన్‌కు వచ్చిన నాగుపాము

Apr 28 2026 9:37 AM | Updated on Apr 28 2026 10:10 AM

Cobra Sparks Panic At Ganneruvaram Police Station

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌లో నాగుపాము హల్‌చల్‌ చేసింది. ఎస్సై నరేందర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎస్సై సోమవారం పోలీసుస్టేషన్‌లోని తన గదిలో ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్నాడు. ఎస్సై సీటు వెనుక ఉన్న కిటకిలోంచి గదిలోకి నాగుపాము ప్రవేశిస్తున్న క్రమంలో ఎదురుగా ఉన్న వ్యక్తి గమనించి పాము అని గట్టిగా అరిచాడు. ఎస్సై వెంటనే తన సీటు ముందున్న టేబుల్‌ పైనుంచి దూకడంతో ప్రమాదం తప్పింది. స్నేక్‌ క్యాచర్‌ పోచయ్యను పిలిపించి, పామును పట్టుకున్నారు. మూడు రోజులుగా పోలీస్‌స్టేషన్‌ అవరణలో పాము తిరుగుతున్నట్లు  తెలిపారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement