మటన్‌ ఉడకలేదు.. | Man Files Police Complaint Over Mutton Not Cooking in Anantapur | Sakshi
Sakshi News home page

మటన్‌ ఉడకలేదు..

Mar 23 2026 7:39 AM | Updated on Mar 23 2026 7:39 AM

Man Files Police Complaint Over Mutton Not Cooking in Anantapur

పోలీసులకు ఓ వ్యక్తి ఫిర్యాదు

తాడిపత్రి టౌన్‌(అనంతపురం): మటన్‌ ఉడకలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన షోడాల హాజీ ఆదివారం పట్టణంలోని ఓ దుకాణంలో మటన్‌ తీసుకు న్నాడు. అయితే అది ఎంతసేపటికీ ఉడకలేదు. 

మటన్‌ వండిన పాత్రతో సహా ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నాడు. మటన్‌ వ్యాపారిపై ఫిర్యాదు చేశాడు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో నాసిరకం మంసాన్ని అంటగట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు తలలు పట్టుకున్నారు. చేసేది లేక సీఐ ఆరోహణరావు మటన్‌ డబ్బులు తానే ఇస్తానులే అంటూ షోడాల హాజీకి నచ్చజెప్పడంతో అతను వెనుదిరిగాడు. ఈ విషయం కాస్తా సోషల్‌ మీడియా గ్రూపుల్లో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement