14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి | one arrest in Chengalpattu City Police Station | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

Jul 10 2025 2:23 PM | Updated on Jul 10 2025 3:16 PM

one arrest in Chengalpattu City Police Station

– యువకుడికి జీవిత ఖైదు  

తమిళనాడు: చెంగల్పట్టు సిటీ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్న ఓ 10వ తరగతి బాలుడు రోజూ సాయంత్రం వేళల్లో ట్యూషన్‌కు వెళ్లేవాడు. ఈనేపథ్యంలో చెంగల్పట్టులో మెకానిక్‌గా పనిచేస్తున్న పాండిచ్చేరి వాసి అమితు అబ్దుల్‌ ఖాదర్‌ 13.04.2024న ట్యూషన్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఆ బాలుడిని తన ద్విచక్ర వాహనం ఎక్కమని అడిగాడు.

 అతను ఎక్కనని చెప్పాడు. దానికి ప్రతిస్పందనగా, అబ్దుల్‌ ఖాదర్‌ ఆ బాలుడిని కత్తితో బెదిరించి తన బైకుపై తీసుకెళ్లి తిరుమణి రైల్వే గేట్‌ సమీపంలోని ఒక పొదలో లైంగిక దాడికి పాల్పడ్డాడు.నేను పిలిచినప్పుడల్లా రాకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తానని కూడా బెదిరించాడు. భయంతో ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈ సందర్భంలో, గత 03.05.2024న, ట్యూషన్‌ పూర్తి చేసుకుని, రాత్రి 8.30 గంటలకు  కాంచీపురం హై రోడ్‌కు తిరిగి వస్తున్న బాలుడిని కిడ్నాప్‌ చేసి, చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక  ముళ్ల పొదలో బంధించి కత్తితో బెదిరించి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డాడు.

 బాధను భరించలేక, ఆ బాలుడు తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో షాక్‌ కు గురైన ఆ బాలుడి తల్లిదండ్రులు చెంగల్పట్టు నగర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అమీద్‌ అబ్దుల్‌ ఖాదర్‌పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అంతేకాకుండా, చెంగల్పట్టు పోక్సో కోర్టు ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. బుధవారం ఈ కేసును విచారించిన ప్రభుత్వ న్యాయవాది లక్ష్మి అమీద్‌ అబ్దుల్‌ ఖాదర్‌కి యావజ్జీవ శిక్షను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement