రికవరీ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కేసులో జైలుకు
అంబర్‌పేట (హైదరాబాద్): రికవరీ చేసిన బంగారాన్ని బాధితులకు అప్పగించకుండా తాకట్టు పెట్టిన ఎస్‌ఐ భానుప్రకాశ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట పోలీసు స్టేషన్‌లో భానుప్రకాశ్‌రెడ్డి డిటెక్టివ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది ఓ చోరీ కేసులో దొంగల నుంచి నాలుగున్నర తులాల బంగారాన్ని రికవరీ చేశాడు. అయితే దానిని బాధితులకు అప్పగించకుండా సొంత అవసరాలకోసం తాకట్టు పెట్టాడు. బాధితులు బంగారం కోసం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా విషయం వెలుగులోకి వచి్చంది. దీంతో భానుప్రకాశ్‌ను సస్పెండ్ చేశారు. విచారణ తర్వాత అరెస్టు చేసి శనివారం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
జాడ తెలియని సరీ్వస్ రివాల్వర్
భానుప్రకాశ్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి జీవితాన్ని దుర్భరంగా చేసుకున్నాడు. ఏకకంగా సరీ్వస్ రివాల్వర్‌ను పొగొట్టుకున్నాడు. దీనిపై ఉన్నతాధికారులు ఎంత విచారించినా ఫలితం లేకుండా పోయిందని సమాచారం. చివరికి రైలులో ప్రయాణిస్తుండగా పోయినట్లు అతను తెలపడంతో ఆ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారని తెలిసింది.


