నైట్‌ డ్యూటీకి భర్త.. ప్రియుడితో భార్య.. | Domestic Tragedies Surge, child Left Orphaned Due To Parents Acts | Sakshi
Sakshi News home page

నైట్‌ డ్యూటీకి భర్త.. ప్రియుడితో భార్య..

Aug 20 2025 11:55 AM | Updated on Aug 20 2025 1:03 PM

Domestic Tragedies Surge, child Left Orphaned Due To Parents Acts

కర్ణాటక: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత నమ్మకం, విశ్వాసం అనే వారధిపై జీవితాంతం సుఖంగా సాగాల్సిన దాంపత్య ప్రయాణానికి మధ్యలోనే బ్రేకులు పడుతున్నాయి. అగ్నిగుండం సాక్షిగా కలిసి ఏడడుగులు నడిచినప్పుడు చేసుకున్న బాసలు చెదిరిపోతున్నాయి. భవిష్యత్‌ కోసం కన్న కలలు చెదిరిపోతున్నాయి. కుటుంబ కలహాలు, అనైతిక సంబంధాలు  పచ్చని కాపురాల్లో  చిచ్చురేపుతున్నాయి.  ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. ఫలితంగా ఆ కుటుంబంలోని చిన్నారులు అనాథలుగా మారుతున్నారు.  

బెంగళూరు నగర జిల్లా ఆనేకల్‌ తాలుకాలో గడిచిన ఐదు నెలల కాలంలో చిన్నచిన్న విషయాలు, అనైతిక సంబంధాల అనుమానాలతో  ఏడుగురు మహిళలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.  తల్లులు హత్యకు గురవ్వడం, తండ్రులు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 2025 జనవరి నుంచి జూన్‌ వరకు  ఆనేకల్‌ తాలూకా సూర్యాసిటీ, ఆనేకల్, ఎల్రక్టానిక్‌సిటీ, హెబ్బగోడిల పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కో హత్య చోటు చేసుకోగా ఆత్తిబెలి పోలీసు స్టేషన్‌ పరిధిలో రెండు హత్యలు జరిగాయి. వివిధ ప్రాంతాలనుంచి ఉపాధి కోసం ఆనేకల్‌ తాలూకాకు వలస వచ్చి ఉంటున్న కుటుంబాల్లో ఈ దారుణాలు జరిగాయి. అక్రమ సంబంధాలు, భార్యలపై అనుమానాలు, మద్యం సేవనం తదితర కారణాలతో ఈ హత్యోదంతాలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.  


భార్య తల నరికి స్టేషన్‌కు వెళ్లిన భర్త 
ఆనేకల్‌ తాలూకా చందాపుర సమీపంలోని హిలలీగ గ్రామంలో జూన్‌ 8న ఓ వ్యక్తి తన భార్య తలను నరికి దానిని కవరులో పెట్టుకోని సూర్యా సిటీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్య మరోవ్యక్తితో అక్రమ సంబంధం  పెట్టుకోవడంతో కడతేర్చినట్లు అంగీకరించాడు. నిందితుడు హెబ్బగోడిలోని పారిశ్రామిక వాడలోని ప్రైవేటు  కంపెనిలో పని చేస్తూ ఐదేళ్ల క్రితం ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది.  తాను రాత్రి విధులకు వెళ్లిన సమయంలో భార్య మరొకరితో గడిపేదని,   ఈ ఘటనను జీర్ణించుకోలేక భార్యను కడతేర్చినట్లు భర్త  పోలీసుల  ఎదుట అంగీకరించాడు.  

  1. ఏప్రిల్‌  5న ఎల్రక్టానిక్‌సిటీ పోలీసు స్టేషన్‌ పరిధిలో బాగేపల్లికి చెందిన మహిళను భర్త అనుమానంతో హత్య చేశాడు.  

  2. మార్చి 28వ తేదిన ఆనేకల్‌ తాలుకా జిగణి పోలీసు స్టేషన్‌పరిధిలో మహిళ హత్యకు గురైంది. జనతా కాలనీకి  చెందిన మహిళకు ఓ వ్యక్తితో వివాహమైంది.  కుటుంబ కలహాలతో ఆమె పుట్టినింటికి చేరింది. భర్త వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరగా ఆమె నిరాకరించింది. దీంతో చాకు తీసుకొని భార్య గొంతు కోసి హత్య చేసి అనంతరం తానూ ఆత్మహత్యా యత్నం చేశాడు. 

    మార్చి 18వ తేన అత్తిబెలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉన్న రాచమానహళ్లిలో భార్య శీలంపై అనుమానంతొ భర్త బార్యను హత్య చేశాడు. 

  3. మార్చి 4న ఆనేకల్‌ పోఈసు స్టేషన్‌ పరిధిలోని గుడ్నళ్లిలో మహిళ హత్యకు గురైంది. దంపతులు మద్యం మత్తులో వాదులాడుకున్నారు. ఓ దశలో భర్త భార్యను హత్య చేశాడు.

  4. పిబ్రవరి 16న సర్జాపుర సమీపంలో తిగళ చౌడదేనహళ్లి గ్రామంలో మానసిక దివ్యాంగురాలు హత్యకు గురైంది. భర్త తన భార్యను నిర్మాన దశలోఉన్న భవనంపైకి తీసుకెళ్లి కిందకు తోసి హత్య చేశాడు.

  5. ఫిబ్రవరి 6న హెబ్బగోడి పోలీసు స్టేషన్‌ పరిధిలో బిడ్డ కళ్ల ముందు ఓ వ్యక్తి తన భార్యను చాకుతో పొడిచి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి హత్యకు గురవ్వడం, తండ్రి జైలుకు వెళ్లడంతో వారి సంతానం అనాథగా మారింది. 

    కౌన్సిలింగ్‌ కేంద్రాలు, మహిళా పోలీస్‌స్టేషన్లు అవసరం 
    ఆనేకల్‌ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాలనుంచి ప్రజలు ఉపాధి కోసం ఇక్కడకు వలస వస్తుంటారు. ఇటీవల దంపతుల మధ్య గోడవలు, అక్రమ సంబంధాలతో హత్యలు రుగతున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా వివాదాల పరిష్కారానికి కౌన్సెలింగ్‌ కేంద్రాలు, మహిళా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement