
కర్నాటక: మద్యం మత్తులో ఐపీఎస్ అధికారి తమ్ముడు పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేసిన సంఘటన గదగ్ జిల్లా బెటగేరి వద్ద జరిగింది. ఐపీఎస్ అధికారిణి అనితా హద్దణ్ణవర్ తమ్ముడు అక్షత్ హద్దణ్ణవర్ మద్యం మత్తులో అర్ధరాత్రి బెటగేరి ఠాణాకు కారులో వచ్చారు. తాను లాయర్‌నని, తన అక్క ఐపీఎస్ అని, తనని ఎవరూ ఏమీ చేయలేరని కేకలు వేయసాగాడు, అడ్డుకోబోయిన స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడాడు. చివరకు పోలీసులు అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పంపించారు. అతని కారు మీద నో పార్కింగ్ చలానా రాశారని గొడవ చేసినట్టు సమాచారం.