పోలీసు కొలువు.. నిత్యం సవాళ్లతో సహవాసం.. పోలీస్ శాఖలో మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తూ.. సత్తా చాటుతున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిలాష బిస్త్ ఆ శాఖలో దూసుకుపోతున్నారు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అభిలాష బిస్త్.. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా సర్వీసులో చేరారు. రాష్ట్ర పోలీస్ శాఖకు ఎంపికవుతున్న కానిస్టేబుల్ నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. 1986లో ఏర్పాటైన పోలీసు అకాడమీకి తొలి మహిళా డైరెక్టర్ కావడం విశేషం.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాక్షి డిజిటల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. పోలీస్ శాఖలో ఆమె జర్నీతో పాటు తెలంగాణ పోలీసింగ్ గురించి వివరించారు. పోలీసుశాఖ పనితీరులో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానం సాధించగా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, వివిధ అంశాలపై మాట్లాడారు. పలు ఆసక్తికరమైన విషయాలు సాక్షితో పంచుకున్నారు.
పూర్తి ఇంటర్వ్యూ కోసం వీడియో క్లిక్ చేయండి:


