సాక్షి హైదరాబాద్: నాంపల్లిలో నిన్న అగ్నిప్రమాద ఘటనపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు( ఆదివారం) ఫర్నీచర్ షాపు యజమాని సతీష్ బచానిని పోలీసులు అరెస్టు చేశారు. అగ్నిప్రమాద ఘటనలో చనిపోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
కాగా నిన్న నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో అఖిల్ (7), ప్రణిత (11), హబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) చనిపోయినట్లు ఫైర్ డిజీ విక్రమ్ సింగ్ మాన్ ప్రకటించారు. సెల్లార్‌లో ఫర్నిచర్, కెమికల్స్ నిల్వ ఉంచడంతో బాధితులు మెట్ల మార్గంలో నుంచి రావడానికి ప్రయత్నించారన్నారు. ఐరన్ షట్టర్‌కు తాళం వేయడంతో బాధితులు బయిటకి రావడం కష్టమైందని తెలిపారు. ఫైర్ సేప్టీ నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.


