సాక్షి, తాడేపల్లి: నాంపల్లి ప్రమాద ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో ఐదుగురి మృతి విషాదకరమన్నారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు వ్యక్తులు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకుని బయటపడగా..మిగతా ఐదుగురి ఆచూకీ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా లభించలేదు. ఆదివారం ఉదయం ఐదు మృతదేహాలను వెలికి తీసి.. అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ ( 43 )గా గుర్తించారు ఈ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


