భార్య గొంతు కోసి చంపేశాడు | Wife And Husband Incident In hyderabad | Sakshi
Sakshi News home page

భార్య గొంతు కోసి చంపేశాడు

Jun 8 2026 7:26 AM | Updated on Jun 8 2026 12:37 PM

Wife And Husband Incident In hyderabad

హైదరాబాద్‌: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌కు చెందిన సులేమాన్‌ బిన్, నిషాత్‌ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్‌ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు. 

మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్‌ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్‌ బాగ్‌లోని ఇంటికి కత్తితో వచి్చన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్‌ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్‌ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్‌పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్‌నుమా ఏసీపీ జావెద్‌ పరిశీలించారు. నిషాత్‌ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement