
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య...
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్‌లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం.
గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.