కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త | - | Sakshi
Sakshi News home page

కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త

Aug 23 2025 2:59 AM | Updated on Aug 23 2025 8:47 AM

-

బాధితురాలికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు

తాడేపల్లి రూరల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్‌లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం విడాకులు కూడా తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. 

అంజలి తాడేపల్లి సలాం సెంటర్‌ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్‌రోడ్‌లో ఉన్న ఓ హోటల్‌లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్‌ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త 1
1/1

కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త

Advertisement
 
Advertisement
Advertisement