చంద్రబాబువి అన్నీ దుర్మార్గపు ఆలోచనలే: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy slammed Chandrababu Naidu over the Seediri Appalaraju case | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి అన్నీ దుర్మార్గపు ఆలోచనలే: వైఎస్‌ జగన్‌

Jul 30 2026 5:51 PM | Updated on Jul 30 2026 6:32 PM

YS Jagan Mohan Reddy slammed Chandrababu Naidu over the Seediri Appalaraju case

సాక్షి,శ్రీకాకుళం : మాజీ మంత్రి సీదిరి అప్పల రాజు కుటుంబంపై చంద్రబాబు సర్కార్‌ కుట్రకు పాల్పడిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మార్చి సీదిరి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందన్నారు. అసలు యాక్సిడెంట్‌ కేసును హత్య కేసుగా ఎలా మారుస్తారు? అంటూ వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. అంపోలు జైలులో ఉన్న సీదిరిని పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్‌ జగన్‌.. అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి సర్కారు అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  ‘ఈ రోజు రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరగుతున్నాయనే దానికి ఇదే నిదర్శనం. కనీసం మానవతా విలువలు లేకుండా మంచితనానికి పాతరేశారు. నీట్‌ రాసి.. తన తండ్రిలాగా డాక్టర్‌ అవ్వాలని అనుకున్నాడు సీదిరి కుమారుడు. తెలిసో తెలియకుండా యాక్సిడెంట్‌ చేశాడు. కానీ కేసును ట్విస్ట్‌ చేసి హత్య చేశాడని, కుట్ర చేసి సీదిరి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.
  
అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ పిల్లాడి జీవితాన్ని నాశనం చేయాలని చూడటం ఎంతవరకు సరైంది. బీసీల్లో సీదిరి మంచి నాయకుడు. వైఎస్సార్‌సీపీ నాయకుడు కాబట్టి. చిన్న పిల్లాడు చేసిన యాక్సిడెంట్‌ను కుట్రగాను. హత్యగాను చిత్రీకరించి సీదిరి కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం ఎంతవరకు ధర్మం. అతిసామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి వైద్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అప్పల రాజును ఇబ్బంది పెట్టేలా తన కెరీర్‌ను నాశనం చేయాలని దుర్మార్గకపు ఆలోచన చేస్తున్నారు.

18 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు గడ్డి తింటున్నారా?. మనిషా? రాక్షసుడా?. ఇదే టీడీపీ నేతలు ఎవరైనా చేస్తే ఇలాగే శిక్షలు విధిస్తారా?. ఇదే శ్రీకాకుళం ఎమ్మెల్యే, పాతపట్నం ఎమ్మెల్యే యాక్సిడెంట్‌ చేస్తే.. ఈ కేసుల్లో ఎవరిని అరెస్టు చేశారు.  ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తే వ్యవస్థ బతకదు. చంద్రబాబు విష విత్తనాలు నాటుతున్నారు. అదే వ్యవస్థను నాశనం చేస్తున్నారు. 

హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తే.. ప్రమాదంలో గాయపడ్డ బాధితుడ్ని రక్షించేందుకు సీదిరి కుమారుడు ప్రయత్నించాడు. 108కి ఫోన్‌ చేశాడు. సీపీఆర్‌ చేశాడు. సీదిరి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు యాదవ మంత్రిని పంపించి ర్యాలీలు చేస్తారా?. అదే చంద్రబాబుకు బాధిత కుటుంబానికి మంచి చేయాలన్న మనసుంటే ఇరు కుటుంబాల మధ్య సయోధ్య చేకూర్చి బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చేసే ప్రయత్నం చేయాలి.

బుర్ర పనిచేస్తుందా బాబు? CPR ఎందుకు చేస్తాడు.. బాబుకు జగన్ కౌంటర్

పేదలంటే ప్రేమలేదు. బీసీలను ఓటు బ్యాంకు కోసం వాడుకుంటాడు. చంద్రబాబుకు బీసీలు కాదు యాదవులంటేనే ప్రేమలేదు. ప్రకాశం జిల్లాలో యాదవ కుటుంబం దాడి చేసి తిరిగి ఆ కుటుంబంపైనే కేసు పెట్టించిన ఘనుడు చంద్రబాబు. చరిత్రలో తొలిసారి యాదవ మహిళను వైఎస్సార్‌సీపీ విశాఖ మేయర్‌ని చేసింది. ఆ తర్వాత చంద్రబాబు కుట్రతో ఆమెకు పదవిని దూరం చేశాడు. విశాఖలో యాదవ భవన్‌ను పూర్తి కాకుండా అక్కడో కుట్ర.  మత్స్యకారులు ప్రమాదానికి గురైతే కనీసం వాళ్ల కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదు. వైఎస్‌ జగన్‌ వెళ్లాడు. బాధితుల్ని పరామర్శించాడు. 

ఫిషింగ్‌ హార్బర్‌లను అమ్ముకుంటుంటున్నాడు. మత్స్యకారుల జీవితాల్ని నాశనం చేస్తున్నాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ లేదు. అమ్మఒడి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, చేస్తే మోసాలు. ప్రశ్నిస్తే వాళ్లమీద తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, జీవితాలు నాశనం అవుతాయన్న జ్ఞానం లేదు. సీదిరి అప్పల రాజు కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తోంది. అప్పల రాజు విషయంలో న్యాయం గెలుస్తోంది. త్వరలో ఆయన జైలు నుంచి బయటకు వస్తారు’ అని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement