దుబాయ్‌లో అనంతపురం మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం | Grand felicitation ceremony in Dubai for Anantapur Mayor Ramesh Goud | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో అనంతపురం మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్‌కు ఘన సన్మానం

Nov 16 2026 11:04 AM | Updated on Nov 16 2026 11:08 AM

Grand felicitation ceremony in Dubai for Anantapur Mayor Ramesh Goud

అనంతపురం నగర మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు చిట్లూరు రమేష్ గౌడ్ దుబాయ్‌కు విచ్చేసిన సందర్భంగా యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి, ఆత్మీయ సమ్మేళనం, ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా, బీసీ అసోసియేషన్స్ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, విద్యావేత్తగా (B.Ed., M.Sc.) రమేష్ గౌడ్ విశేష గుర్తింపు పొందారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం నుంచి ఎదురైన రాజకీయ ఒత్తిళ్లు, ఎన్నికల సమయంలో ఎదురైన ఇబ్బందులు, అక్రమాలు, రిగ్గింగ్ ఆరోపణలు వంటి అనేక ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా తన రాజకీయ నిబద్ధతను చాటుకున్నారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించిన శ్రీ రమేష్ గౌడ్ గారి పట్టుదల, పోరాట స్ఫూర్తి అభినందనీయమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసంతో, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడిన ఆయన రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  సత్తి ప్రసన్న సోమిరెడ్డి గారు, శ్రీ రామ్ గార్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం మరియు సన్మాన కార్యక్రమంలో పార్టీ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీ రామ్, రెడ్డయ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిలాన్ బాషా, తరపట్ల మోహన్, జహీర్, కోటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సోమశేఖర్, వేండ్ర శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫహీం, హనుమంతు రెడ్డి, అబ్దుల్లా, వేంకట రమణా రెడ్డి, మనోహర్, నరేష్ చౌదరి, అక్రమ్, చక్రి, సుధాకర్ రెడ్డి, ఖలీల్, రాజా రెడ్డి, సురేష్, తారక్, భరత్,శ్రీ గణపతి రాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

దుబాయ్‌లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఐక్యతను, పరస్పర స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్ : శంకర్‌ నేత్రాలయ యూఎస్ఏ 20 లక్షల డాలర్ల విరాళాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement